T20 World Cup 2026: PSL బ్యాన్, ఆర్థిక ఆంక్షలు.. ఐసీసీ దెబ్బతో పాక్ క్రికెట్ ఖతం.!

  • పాకిస్తాన్‌పై కఠిన చర్యలకు సిద్ధమవుతున్న ఐసీసీ..
  • భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేసి భారీ మూల్యం చెల్లించుకోనున్న పాకిస్తాన్..
  • పీఎస్ఎల్‌పై బ్యాన్, ఆర్థిక ఆంక్షలు ప్రకటించే అవకాశం..
Ind Vs Pak (1)

Ind Vs Pak (1)

T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచకప్‌ చుట్టూ వివాదాలు ముదురుతూనే ఉన్నాయి. తాజాగా, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్, భారత్‌తో ఈ నెల 15న కొలంబోలో జరగనున్న మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసింది. అయితే, దీని పరిణామాలు పాకిస్తాన్ క్రికెట్‌నే సంక్షోభంలోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) పాక్‌పై భారీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారీ ఆర్థిక జరిమానాలతో పాటు క్రికెట్ పరంగా పాకిస్తాన్‌పై నిషేధాలు విధించవచ్చని సమాచారం.

Read Also: Ambati Rambabu Daughter: ఎన్నో చూశాం కానీ.. ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదు!

పాక్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయడం ఐసీసీ, బీసీసీఐతో ఉన్న బైండింగ్ కాంట్రాక్ట్‌కు విరుద్ధమని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది. ఐసీసీ బోర్డు సోమవారం వర్చువల్‌గా సమావేశం నిర్వహించింది. పాక్ టోర్నమెంట్ ఆడాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. ఒక వేళ టోర్నమెంట్ ఆడేందుకు అనుమతించినా పీసీబీ కఠిన చర్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.

ఐసీసీ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే వార్షిక ఆదాయాన్ని నిలిపేయడం, ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం ఇతర దేశాలు పాక్ వెళ్లడానికి నిరాకరించడం, ఒక వేళ మ్యాచ్ ఆడినా ఐసీసీ ర్యాంకింగ్స్, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) పాయింట్లకు లెక్కించకపోవడం, హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ జియో స్టార్ కు జరిగిన నష్టానికి పీసీబీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) పై కూడా బ్యాన్ ఉంటుందని తెలుస్తోంది. రిటైర్డ్ ఆటగాళ్లను తప్పా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెడ్ ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్‌లో పాల్గొనకుండా నిషేధం విధించే అవకాశం ఉంది.