Shaheen Shah Afridi: అందుకే మిమ్మల్ని ‘స్కూల్ కిడ్స్’ అనింది.. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ప్రీమియం ఫాస్ట్ బౌలర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaheen Shah Afridi: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో లాహోర్ ఖలందర్స్ జట్టు కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదీ (Shaheen Shah Afridi)పై కఠిన చర్యలు తీసుకుంది పీఎస్ఎల్ మేనేజ్మెంట్. టీమ్ హోటల్‌లో భద్రతా నిబంధనలను (Security Protocols) ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో అఫ్రిదీకి 10 లక్షల పాకిస్థానీ రూపాయల (3600 అమెరికన్ డాలర్లు) జరిమానా విధించింది. జట్టులో క్రమశిక్షణను కాపాడటానికి, బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజ్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.
CSK-MS Dhoni: ‘ధోని’ లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గెలవలేదా..? ఆయన లేని లోటు స్పష్టంగా..
Also Read
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
- Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
పంజాబ్ పోలీసులు పీఎస్ఎల్ సీఈఓ సల్మాన్ నసీర్‌కు రాసిన లేఖ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం క్రీడాకారులు తమ గదుల్లోకి సందర్శకులను అనుమతించకూడదు. అయితే పీసీబీ సెక్యూరిటీ, యాంటీ కరప్షన్ మేనేజర్ అనుమతి నిరాకరించినప్పటికీ.. షాహీన్ అఫ్రిదీ, సికందర్ రజాలు తమ గదిలోకి అతిథులను తీసుకెళ్లారని పోలీసులు ఆరోపించారు. సికందర్ రజా ఆ అతిథులు కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉన్నారని చెప్పగా, పోలీసులు మాత్రం వారు దాదాపు మూడు గంటల పాటు గదిలోనే గడిపారని లేఖలో పేర్కొన్నారు.
ఈ ఘటనలో మరో ఆటగాడు సికందర్ రజా పేరు కూడా ఉన్నప్పటికీ, అతనిపై జట్టు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రజా మాట్లాడుతూ.. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తనదేనని, అఫ్రిదీకి ఇందులో ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. కెప్టెన్ ను ఈ వివాదం నుండి తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ, మేనేజ్మెంట్ మాత్రం అఫ్రిదీపై జరిమానా విధించడానికే మొగ్గు చూపింది.
ఈ వివాదంపై లాహోర్ ఖలందర్స్ స్పందిస్తూ.. ఇది కేవలం ఒక అపార్థం వల్ల జరిగిన పొరపాటే తప్ప, కావాలని నిబంధనలను ఉల్లంఘించాలనే ఉద్దేశం ఆటగాళ్లకు లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బహిరంగంగా అతిగా ప్రచారం చేశారని, అనవసరంగా వివాదాన్ని పెద్దది చేశారని అసహనం వ్యక్తం చేసింది. ఏదేమైనా, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) కచ్చితంగా పాటిస్తామని సంస్థ వివరణ ఇచ్చుకుంది.
తాజావార్తలు
-
CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
-
Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
-
Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!