NTV Telugu Site icon

Naseem Shah: PSL మ్యాచ్‌కు BPL హెల్మెట్.. పాక్ క్రికెటర్‌కు జరిమానా

8

8

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ సందర్భంగా 20 ఏళ్ల పాక్ బౌలర్ అయిన నసీమ్‌షా.. పాక్ సూపర్ లీగ్ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన హెల్మెట్‌ను పెట్టుకొచ్చాడు. దీంతో ఈ ఫోటో కాస్త నెట్టింట వైరల్‌గా మారి నసీమ్ నెటిజన్ల ట్రోల్స్‌కు గురవుతున్నాడు. “ఇలాంటివి పాకిస్తాన్‌లో మాత్రమే జరుగుతాయి” అని ఓ అభిమాని చమత్కరించాడు. పాక్ పరిస్థితి మరీ ఇంతలా అయిపోయిందా.. అని మరో అభిమాని సెటైర్ వేశాడు. దీంతో దీనిపై స్పందించిన పాక్ క్రికెట్ బోర్డు.. అతడిని హెచ్చరిస్తూ జరిమానా విధించింది.

Also Read: Crime News: మరికాసేపట్లో పెళ్లి.. రైలుపట్టాలపై పెళ్లికొడుకు శవం

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా శుక్రవారం క్వెట్టా గ్లాడియేటర్స్-ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 20 ఏళ్ల క్వెట్టా పేసర్ నసీమ్ షా బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో పొరపాటుగా వేరే లీగ్ హెల్మెట్ పెట్టుకొచ్చాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో అతడు బరిలోకి దిగే కొమిలియా విక్టోరియన్స్‌కు చెందిన హెల్మెట్‌ను ఈ లీగ్ మ్యాచ్‌లో ధరించాడు. దీంతో లీగ్ రూల్స్ ప్రకారం షాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని మందలించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు 110 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. అనంతరం ఛేజింగ్‌లో 13.3 ఓవర్లలోనే 111 రన్స్ చేసి ముల్తాన్ జట్టు విజేతగా నిలిచింది. 20 ఏళ్ల ఇసానుల్లా కేవలం 12 రన్స్ ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టి ముల్తాన్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

Also Read: Prithvi Shaw: పృథ్వీ షా ఎవరో కూడా నాకు తెలియదు: సప్నా గిల్

Show comments