NTV Telugu Site icon

Bangladesh: బంగ్లాదేశ్ లో మళ్లీ హింస..సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం

Bangladesh

Bangladesh

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం నుంచి నిరసనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. జులైలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల సందర్భంగా 200 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. వారికి న్యాయం చేయాలంటూ ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. కోర్టు తీర్పు తర్వాత నిరసనలు తగ్గాయి. అయితే తాజాగా శుక్రవారం నుంచి మళ్లీ నిరసన కారులు రోడ్డెక్కారు. దీంతో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించింది. శుక్రవారం హసీనా ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్‌టాక్, వాట్సాప్, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అక్కడ పనిచేయవు.

READ MORE: Tips To Uses Of Silica Gel: వావ్‌.. ఈ తెల్లటి ప్యాకెట్లు మీకు కనిపించాయా..? ఇలా చేయండి..

గ్లోబల్ ఐస్ నివేదిక ప్రకారం.. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా సోషల్ మీడియా సైట్‌లపై తాత్కాలిక నిషేధం విధించబడింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం మొబైల్‌లో మెటా ప్లాట్‌ఫారమ్‌ల నెట్‌వర్క్‌ను మధ్యాహ్నం 12 గంటల తర్వాత పరిమితం చేసింది. ఇంటర్నెట్ స్పీడ్ కూడా చాలా మందగించబడింది. తద్వారా వీపీఎస్ (VPN) ఉపయోగించి కూడా సోషల్ మీడియాను ఉపయోగించలేరు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో జులై 17న తొలిసారిగా ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. దీని తర్వాత 18న బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను కూడా నిలిపివేశారు. 28వ తేదీ వరకు మొబైల్ నెట్‌వర్క్‌లపై నిషేధం ఉంది. రాజధాని ఢాకాలోని వివిధ ప్రాంతాల్లో రెండు వేల మందికి పైగా నిరసనకారులు గుమిగూడడంతో మళ్లీ ఉద్రిక్తతత పరిస్థితులు ఏర్పడ్డాయి.

READ MORE:Pakistan: పాకిస్తాన్‌లో ‘‘జగన్నాథ రథయాత్ర’’ .. వేలాది మంది హాజరైన వీడియో వైరల్..

నిరసన కారులు ‘బాధితులకు న్యాయం చేయండి’ అంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వారిని చుట్టుముట్టారు. ఢాకాలోని ఉత్తరా ప్రాంతంలో పోలీసులు, విద్యార్థులు ఘర్షణ పడ్డారు. అయితే భద్రతా అధికారులు రాళ్లు రువ్వుతున్న నిరసనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్‌లను ప్రయోగించారు. కాగా.. ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వం గత నెల నుంచి విద్యార్థుల నిరసనలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ నిరసనలు మందగించే సంకేతాలు లేవు. జులై 15 న హింస చెలరేగినప్పటి నుంచి, నిరసనలు షేక్ హసీనాకు పెద్ద సంక్షోభంగా మారాయి.

Show comments