NTV Telugu Site icon

Konda Surekha: జోగులాంబ ఆల‌య పూజారిపై క్రిమినల్ కేసులు.. విచార‌ణ‌కు మంత్రి కొండా సురేఖ ఆదేశం

Jogulamb

Jogulamb

జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఈఓ పురేందర్ అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ దేవాదాయశాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. హైద‌రాబాద్ బొగ్గుల‌కుంట‌లో జ‌రిగిన ఈ ఆందోళ‌న‌కు కొత్తకోట ఆశ్రమ అర్చకుడు శివానంద స్వామి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. శక్తిపీఠాలలో ఒక పీఠం అయిన అలంపూర్ జోగులాంబ ఆలయ పవిత్రతను కాపాడాలన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ పై క్రిమినల్ కేసులు ఉన్నందున.. వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా ఆనంద్ శర్మపై ఆరోపణలు వస్తున్నా.. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆందోళనలో పాల్గొన్న వారు మండిపడ్డారు.

READ MORE: Minister Narayana: వైసీపీ వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు..

ఆలయం లోని ఆభరణాల మాయం, పూజారి, ఈవోల అవినీతి పై ప్రభుత్వ సమగ్ర విచారణ జరిపితే.. నిజాలు బయట పడతాయన్నారు. ఆ త‌ర్వాత అక్కడి నుంచి మినిస్టర్ క్వార్టర్స్ లో దేవ‌దాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌ను క‌లిశారు. వెంట‌నే పూజారి ఆనంద్ శ‌ర్మ‌ను విధుల నుంచి త‌ప్పించాల‌ని కోరారు. అర‌గంట‌పాటు అర్చకులు, స్వామిజీలు చెప్పిన విష‌యాలు విన్న మంత్రి కొండ సురేఖ ఆల‌య ప్రతిష్టను కాపాడ‌తామ‌ని హామీ ఇచ్చారు. ఆనంద్ శ‌ర్మపై విచార‌ణ‌కు ఆదేశించారు. త‌క్షణం విచారణ చేసి నివేదిక ఇవ్వాల‌ని క‌మిష‌న‌ర్‌ను ఆదేశించారు.

READ MORE: Hyderabad : గుడిలో శివ పార్వతల విగ్రహాలు ఎత్తుకెళ్లిన అక్కాచెల్లెల్లు.. ఎందుకిలా చేశారంటే?