Site icon NTV Telugu

MLA Shankar Naik: ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కి నిరసన సెగ

Shankar Naik

Shankar Naik

మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కి శనిగపూరం, బోడ తండా లో నిరసన సెగ తగిలింది… మహబూబాబాద్ పట్టణ శివారులోని9. 10, వార్డులో ని శనిగపూరం, బోడ తండాలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రజల సమస్యల తెలుసుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే నీ తండవాసులు చుట్టుముట్టారు. మా సమస్యలను పరిష్కరించాలంటూ నిలదీశారు.. గత 10 సంవత్సరాల నుండి ఏ ఒక్క సమస్య ను పరిష్కరించలేదని ..రోడ్లు ఆధ్వనంగా వున్నాయని అనేకసార్లు చేప్పిన పట్టించుకోలేదని మండిపడ్డారు.

Also Read : SRH vs CSK: టాస్ గెలిచిన సీఎస్కే.. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్

గతంలో పనిచేసిన ఎమ్మెల్యే శ్రీ రాం భద్రయ్య ఆధ్వర్యంలో ఆభివృధ్ధి జరిగిందని.. ఆప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి ఆభివృధ్ధి జరగలేదని ఆధికారపార్టీ నాయకలు అరోపించారు. ఎలక్షన్ సమయం దగ్గర కి రావడంతో గ్రామంలోకి వస్తున్నారని ..మా సమస్యల ను పరిష్కరించకపోతే ఊరిలోకి రావద్దు అంటూ తండ వాసులు హెచ్చరిస్తున్నారు….మీ డిమాండ్లు ను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ హామీ ఇచ్చారు.. అయితే ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను నెరవేర్చి గ్రామాన్ని బాగు చేస్తాడా అనేది వేచి చూడాల్సిందే.

Also Read : Chiranjeevi: మేనల్లుడు హిట్.. మామయ్య దిల్ ఖుష్

Exit mobile version