NTV Telugu Site icon

Beauty Salons: బ్యూటీ పార్లర్లపై నిషేధం.. వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన ఆఫ్ఘన్ మహిళలు

Afghanistan

Afghanistan

Beauty Salons: దేశవ్యాప్తంగా బ్యూటీ పార్లర్లను మూసివేయాలని తాలిబాన్ ఆదేశించడంతో డజన్ల కొద్దీ ఆఫ్ఘన్ మహిళలు బుధవారం నిరసన తెలిపారు. భద్రతా బలగాలు వాటర్ గన్నులను ఉపయోగించాయి. అంతేకాకుండా నిరసన తెలుపుతున్న మహిళలపై గాలిలోకి కాల్పులు జరిపాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని అన్ని సెలూన్‌లు తమ వ్యాపారాలు, దుకాణాలను మూసివేయడానికి ఒక నెల సమయం ఇస్తున్నట్లు తాలిబాన్ ఈ నెల ప్రారంభంలో చెప్పారు. ఈ ఉత్తర్వు మహిళా పారిశ్రామికవేత్తలపై ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also:Netflix: నెట్‌ఫ్లిక్స్‌ కీలక నిర్ణయం.. ఇకపై పాస్‌వర్డ్ షేరింగ్‌ బంద్!

వారు ఇస్లాం నిషేధించిన సేవలను అందజేస్తున్నారని, వివాహ వేడుకల సమయంలో వరుల కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తున్నారని ఆరోపిస్తూ సెలూన్‌లను నిషేధిస్తున్నట్లు తాలిబాన్లు చెప్పారు. తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా నుండి ఈ ఉత్తర్వు వచ్చింది. తాలిబాన్ ఆదేశాలకు వ్యతిరేకంగా డజన్ల కొద్దీ బ్యూటీషియన్లు, మేకప్ కళాకారులు రాజధాని కాబూల్‌లో సమావేశమయ్యారు.

Read Also:Noida: దారుణం.. రోడ్డుపై ఓ యువకుడిని కొట్టి కారు బానెట్‌పై కిలోమీటరు లాక్కెళ్లాడు

తాలిబన్లు నిరసనకారులపై నీటి ఫిరంగులను ప్రయోగించారు. వారిని చెదరగొట్టడానికి రైఫిల్స్‌తో గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం ఫర్జానా మాట్లాడుతూ మహిళలు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్‌కు వెళ్తున్నారని చెప్పారు. నిరసనకారులు ఐక్యంగా ఉండాలని ఆమె కోరారు. పేరు చెప్పడానికి ఇష్టపడని మరో మహిళ మాట్లాడుతూ, “మా నిరసన ఉద్దేశ్యం వారు (తాలిబాన్) పునరాలోచనలో పడేలా చేయడం.. బ్యూటీ సెలూన్‌ను మూసివేయాలనే నిర్ణయాన్ని మార్చుకోవడం. మేము 50 నుండి 60 మంది మహిళలు ఇందులో పాల్గొన్నాం. మా నినాదం పని, రొట్టె, స్వేచ్ఛ.’ మహిళల నిరసనలపై తాలిబాన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నుండి ఎలాంటి రిప్లై రాలేదు.