తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యుత్ పై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇరు పక్షాలకు సూచించారు. సభ హుందాతనం కాపాడండి అని తెలిపారు. కొత్త సభ్యులు నేర్చుకోవాలని అన్నారు. వ్యక్తిగత దూషణలు వద్దు.. మేము, వాళ్ళు ఇద్దరు వ్యక్తి గత దూషణలు వద్దని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై మాట్లాడుతూ.. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలియదు.. తప్పు చేయకున్నా.. కొన్ని సార్లు శిక్ష పడుతుందని అన్నారు.
Read Also: Anganwadi Protest: కనీస వేతనం కోసం సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: శ్రీనివాసరావు
ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఖబడ్దార్ అని మాట్లాడారు. అతనిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. ఇంతలో స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలు వద్దు.. సభ మర్యాదలు కాపాడండని అన్నారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఇదే సభలో.. ఉరికించి కొడతా అన్నాడు. అప్పుడు ఎటు పోయింది మీ సంస్కారం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. తమ నుండి ఆ మాటలు రావడానికి మీరే కారణం.. తొందర పడకండి.. అధికారంలోకి వచ్చి 10 రోజులే అయ్యింది.. ఓపిక పట్టండని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Read Also: Pallavi Prashanth: బెయిల్ ఇవ్వండి ప్లీజ్.. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు