దశాబ్దాల నిరీక్షణకు తెర పడింది. మూడు దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి కల్పించనుంది రాష్ట్ర సర్కార్. జీవో 134 ద్వారా 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి పొందనున్నారు. కాగా.. సచివాలయంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తమకు పదోన్నతలను కల్పించడం పట్ల నూతన ఈవోలు ఆనందభాష్పాలతో సంతోషం వ్యక్తం చేశారు. దసరా పండుగ వారం రోజుల ముందుగా వచ్చిందని ఈవోలు సంబరాలు చేసుకున్నారు.
Read Also: Minister Narayana: నెల్లూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా మారుస్తాం..
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందనడానికి వీరి ప్రమోషన్లే ప్రత్యక్ష ఉదాహరణ అన్న మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇప్పటికే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈవోలుగా పలువురికి ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిన విషయాన్ని మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను అణచివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల ప్రగతికి, దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు ఉద్యోగులు పునరంకితం కావాలని మంత్రి కోరారు.
Read Also: Sabarimala: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం షాక్.. ఈ ఏడాది దర్శనం వారికే..!