Prabhas Fans Reactions on ProjectK Glimpse: ‘బాహుబలి’ సినిమాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఆ రేంజ్ హిట్ మూవీ పడలేదు. బాహుబలి-2 అనంతరం సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. దీంతో ప్రాజెక్ట్ కే (వర్కింగ్ టైటిల్), సలార్ సినిమాల మీదనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల సలార్ టీజర్‌తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చిన డార్లింగ్.. ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్‌తో డబుల్ కిక్ ఇచ్చారు. గ్లింప్స్‌తో పాటు ఈ చిత్రానికి ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేసింది.
అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ‘శాన్ డియాగో కామిక్ కాన్’ (San Diego Comic Con) వేడుకలో చిత్ర యూనిట్ ప్రాజెక్ట్ కే గ్లింప్స్, టైటిల్‌ని ప్రకటించింది. దాంతో శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‌లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా కల్కి 2898 ఏడీ రికార్డుకెక్కింది. ప్రభాస్, కమల్ హాసన్, అశ్వనీదత్‌తో పాటు రానా దగ్గుబాటి ఆ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
Also Read: Virat Kohli Unique Record: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
‘ప్రపంచాన్ని పెను చీకటి కమ్మేసినప్పుడు.. ఒక శక్తి పుట్టుకొస్తుంది. అప్పుడు అంతం అరంభమవుతుంది’ అని కల్కి 2898 ఏడీ గ్లింప్స్ (Kalki 2898 AD Glimpse)లో చూపించారు. గ్లింప్స్ మొత్తం ఒకటే డైలాగ్ ఉన్నా సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. యాక్షన్ సీన్స్, విజువల్స్ అందరినీ కట్టిపడేశాయి. ఇక ప్రభాస్ లుక్ అదిరిపోయింది. దాంతో డార్లింగ్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ చూసి దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం చేస్తాడో అని ఆందోళన పడిన ఫాన్స్.. గ్లింప్స్ చూసి కాలర్ ఎగరేస్తున్నారు. బాగుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘గ్లింప్స్ మామూలుగా లేదు భయ్యా’, ‘గ్లింప్స్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి’ అని కామెంట్స్ చేస్తున్నారు.
మహానటి తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.
https://twitter.com/Vijayamrutraj/status/1682234087115726848?s=20
Rebel Star #Prabhas made us proud today @Comic_Con with Team #Kalki2898AD
We are feeling overjoyed, a day to remember for indian cinema.
Thank you @nagashwin7 & @VyjayanthiFilms pic.twitter.com/PmY69niIb8
— PRABHAS FANS USA (@PrabhasUSAFC) July 20, 2023
#Prabhas𓃵 fans right now #Kalki2898AD pic.twitter.com/HHwUDjnzKi
— 𝖬𝖺𝗁𝗂 (@wbvinnyhong) July 21, 2023
Feeling Proud🥹
Our Saviour, Indian Cinema Saviour #Prabhas 🙌🏻#ProjectK at Comic con is a huge Success 💥💥
Hail Darling PRABHAS#ProjectKGlimpse #Kalki2898AD pic.twitter.com/vDaigLWxFe
— Prabhas Fans USA🇺🇸 (@PrabhasFansUSA) July 20, 2023
