Kodandaram: తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జనసమితి పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బస్సుయాత్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జనసమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ కలిశారు. ప్రస్తుతం కరీంనగర్ లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీతో కోదండరామ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ ను రాహుల్ గాంధీ కోరినట్లు సమాచారం. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు, మూడు చోట్ల కోదండరామ్ సీట్లు అడుగుతారని చెప్పారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ముదోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను గెలవాలని జన సమితి భావిస్తోంది. రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని దాన్ని అంతమొందించేందుకు పొత్తులపై చర్చించామని అన్నారు. తదుపరి విషయాలు త్వరలో తెలియజేస్తామన్నారు. కరీంనగర్ V-పార్క్ నుంచి మూడో రోజు కాంగ్రేస్ విజయ భేరి యాత్ర ప్రారంభమైంది. కోదండరాం తో సమావేశం అనంతరం జగిత్యాల కార్నర్ మీటింగ్ లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ బయలుదేరారు.
కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ ధ్వంసమైందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రొ. కోదండరామ్ అన్నారు. అప్పట్లో చెప్పులు లేకుండా రాజభవనాలకు వెళ్లారని, ఇప్పుడు ప్రగతి భవన్ గేటు దాటలేకపోతున్నారని విమర్శించారు. స్వరాష్ట్రంలో విద్యా వ్యవస్థ? విధ్వంసం? గురువారం ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ కన్వీనర్ గౌరీ సతీష్ అధ్యక్షతన చర్చా వేదిక జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రొ.కోదండరామ్ హాజరై మాట్లాడారు. నిరుద్యోగులు స్థాపించిన కాలేజీలపైనే విజిలెన్స్ దాడులకు తెగబడుతున్నారని, వేధింపుల కారణంగా చాలా కాలేజీలు మూతపడ్డాయన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు చేయడం లేదని, చిన్న కాలేజీలపైనే ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం దిగి వస్తే తప్ప తెలంగాణలో విద్యారంగం బాగుపడదన్నారు. డబ్బుల ఆటలో ప్రజలు గల్లంతు అవుతున్నారని, తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, సమస్యలపై పోరాడే వారికి అండగా నిలుస్తానన్నారు.
Google Pay: గుడ్‌న్యూస్ చెప్పిన గూగుల్ పే.. ఇక, ఎక్కడికీ పోవాల్సిన పనిలేదు..!