జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు.ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read : AA 23 : డ్రీమ్ ప్రాజెక్ట్ పై లోకేష్ కనగరాజ్ కామెంట్స్.. ఫీలవుతున్న సూర్య ఫ్యాన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 ఘన విజయం తర్వాత దాని సీక్వెల్ ‘దేవర 2’పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. అయితే దేవర 2 ఉండబోదని ఎన్టీఆర్ అందుకె వేరే సినిమాలను లైన్ లో పెట్టాడని ఇటివల వార్తలు వినిపించాయి. తాజాగా చిత్ర నిర్మాత మిక్కిలినేని సుధాకర్ పై సంచలన కామెంట్స్ చేసాడు. ఓ ప్రయివేట్ ఈవెంట్ లో మాట్లాడూతూ ‘దేవర 2 షూటింగ్ మే 2026లో ప్రారంభమవుతుంది. అలాగే ఈ సినిమాను 2027లో థియేటర్లలో విడుదల చేస్తాం’ అని అన్నారు. ఇటీవల కాలంలో దేవర 2 పై ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఉంటుందా ఉండదా అనే డైలమా నెలకొంది. ఇప్పుడు నిర్మాత సుధాకర్ చేసిన వ్యాఖ్యలుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో జనతా గ్యారేజ్, దేవర వంటి సూపర్ హిట్స్ తర్వాత అదే టీమ్ ‘దేవర 2’ చేస్తుండడంతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు.
