Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఘన విజయం సాధించిన పుష్పకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడేళ్ళుగా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగాడిసెంబర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీలోనూ అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమా ఏమాత్రం ప్రమోషన్ చేయకున్నా ఏకంగా వంద కోట్లకు పైగా హిందీ మార్కెట్ నుంచి రాబట్టి ఆశ్చర్య పరిచింది. పైగా కరోనా సమయంలో వంద కోట్లను హిందీ వర్షన్ ద్వారా రాబట్టడం ద్వారా ఉత్తరాదిని సైతం ఆశ్చర్యపరిచింది. పుష్ప సినిమా భారీ వసూళ్లు దక్కించుకున్న నేపథ్యంలో సీక్వెల్ పుష్ప 2 పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు సుకుమార్ దాదాపు రెండేళ్ల సమయం తీసుకుని సినిమాను చేశారు.
Read Also:Very Heavy Rains in AP: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో సెలవు
ఎట్టకేలకు పుష్ప 2 సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల చివర్లో గుమ్మడికాయ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్నా కొద్ది ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడి సినిమా స్థాయిని మరింత పెంచేస్తూనే ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడిగా పేర్గాంచిన నిర్మాత ఎస్‌కేఎన్ మీడియా ముందుకు వచ్చారు. ‘ఘటికాచలం’ సినిమా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై నిర్మాత ఎస్‌కేఎన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also:Pakistan Cricket: ఘన ప్రస్థానం నుంచి పతనం వైపు.. పాకిస్తాన్ క్రికెట్‌కు ఏమైంది?
ఆయన మాట్లాడుతూ… ఇటీవల నేను అల్లు అర్జున్ డబ్బింగ్ చెబుతూ ఉంటే పుష్ప 2 సినిమాలోని రెండు సీన్లు చూశాను. సినిమా విడుదల తర్వాత వరుసగా అవార్డులు దక్కించుకోవడం ఖాయం అన్నట్లు అనిపించింది. పుష్ప తో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ రాబోయే ఏడేళ్లలో ఇండియాలో ఉన్న అన్ని అవార్డులను సొంతం చేసుకుంటారని అన్నారు. మొత్తానికి అల్లు అర్జున్ నటన పుష్ప 2 లో అద్భుతంగా ఉందని, కచ్చితంగా సినిమా రికార్డుల మోత మోగడం ఖాయం అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలతో సినిమా గురించి మరోసారి చర్చ మొదలు అయింది.