NTV Telugu Site icon

Raj Tarun: సినిమా షూటింగ్‌లో అస్సలు నాన్ వెజ్జే పెట్టలేదట!

Purushothamudu Pre Release Event

Purushothamudu Pre Release Event

Purushothamudu Movie Producer Ramesh Comments: రాజ్ తరుణ్ హీరోగా హాసిని హీరోయిన్గా పురుషోత్తముడు అనే సినిమా తెరకెక్కింది. నిజానికి జూన్ నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో ఆగస్టు నెలకు వాయిదా పడింది. అయితే ఆగస్టు నెల మొత్తం సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ కి రెడీ అవ్వడంతో జూలై 26వ తేదీన సినిమాని రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రామ్ భీమన దర్శకత్వంలో రమేష్ తేజావత్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి రాజ్ తరుణ్ మాత్రం హాజరు కాలేదు. మిగతా సినిమా యూనిట్ అంతా హాజరైంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో నిర్మాత రమేష్ మాట్లాడుతూ ఈ సినిమా సెట్ లో అసలు నాన్ వెజ్ అనేదే పెట్టలేదని చెప్పుకొచ్చారు.

Also Read: Champions Trophy 2025: బీసీసీఐని ఒప్పించండి.. ఐసీసీని వేడుకుంటున్న పీసీబీ!

సినిమా అనేది తమ వరకు ఒక మంచి కార్యమని, దానికి ముందు జీవహింస చేయడం కరెక్ట్ అనిపించలేదని నిర్మాత రమేష్ అన్నారు. స్వతహాగా తాము ప్యూర్ వెజిటేరియన్ అని జీవహింసకు పూర్తిగా వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. అలా అని మాంసాహారం తినే వాళ్ళని నేనేమీ అనడం లేదు కానీ మేము పూజించే దేవతకు నాన్ వెజ్ అనేది ఇష్టం ఉండదు. కాబట్టి ఆమెను పూజించి మొదలుపెట్టే షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నాన్ వెజ్ దూరంగా పెట్టామని అన్నారు. కేజీ 200 విలువ చేసే నాన్వెజ్ కంటే కేజీ 800 విలువ చేసే జీడిపప్పులతో తాము కూరలు వండించి యూనిట్ మొత్తానికి పెట్టించామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Show comments