NTV Telugu Site icon

NagaVamsi : టికెట్ ధరలపై నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు

Nagavamsi

Nagavamsi

నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్ తో జెట్ స్పీడ్ లో  సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం అయన బాబీ డైరెక్షన్ లో  డాకు మహారాజ్ సినిమాలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

తాజాగా దర్శక నిర్మాతల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ ఈ రోజు ఫస్ట్ హాఫ్ చూసాను. ఈ సినిమా ఇక్కడికి వెళ్లి ఆగుతుంది అనేది చెప్పలేం అనేలా వచ్చింది.ఈ సినిమాకు USA, AP, Hyd  ఇలా మూడు చోట్ల మూడు ఈవెంట్స్ ప్లాన్ చేసాము. బాలకృష్ణ గారితో నేను పని చేయాలి అని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి అనుకుంటున్నాను. గత 20-25 సంవత్సరాలలో బాలకృష్ణని చూడని విధంగా విజువల్స్ వండర్స్ తో ఈ సినిమాను చేసాం. చిరంజీవి  ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పరవాలేదు. బాలకృష్ణ ఫ్యాన్ గా చెప్తున్నాను. బాబీ చిరు సినిమా (వాల్తేర్ వీరయ్య) కంటే ఈ సినిమా చాలా బాగా తీశారు. సినిమా టికెట్ రేట్ అవసరం ఉన్నప్పుడు కచ్చితంగా ప్రభుత్వాలని అడుగుతాం. ముందుగా హీరోని సాటిస్ఫై చేయడం మా భాద్యత.  ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ను త్వరలో టాలీవుడ్ ప్రముఖులు కలుస్తున్నారనే విషయం నాకు తెలీదు. నేనిక్కడ ఎంతో డబ్బు పెట్టి సొంత ఇళ్లు కట్టుకున్నా ఏపీకి ఎందుకు వెళతాను.సినిమా ఇండస్ట్రీ ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల విషయంలోనూ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది’ అని అన్నారు.

Also Read : Bobby : బాలకృష్ణతో సినిమా చేస్తే ఆయనతో ప్రేమలో పడిపోతారు