NTV Telugu Site icon

Thangalaan : ఎట్టకేలకు ఆ ఓటీటీలోకి తంగలాన్

Thangalaan

Thangalaan

Thangalaan : పా ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహించిన ‘తంగలాన్’ ఈ ఏడాది విడుదలైంది. ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ అందుకుంది. సమాజంలో అనేక చర్చలకు దారితీసింది. భారీ అంచనాల నడుమ ‘తంగలాన్’ సినిమా రూపొందింది. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. విక్రమ్, పా రంజిత్‌ల కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమా రూపొందింది. దీంతో కోలీవుడ్‌ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఆగస్టు 15న ‘తంగలాన్’ థియేటర్లలో విడుదలైంది. విక్రమ్, పార్వతి తిరువొతు, మాళవిక మోహన్, పశుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. కోలార్ బంగారు క్షేత్రం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో మిశ్రమ స్పందన వచ్చింది.

Read Also:Election Commission: నేడు జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్..

బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తంగలాన్ సినిమాను థియేటర్‌ లో చూడలేక పోయిన వారు ఓటీటీ లో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తంగలాన్ సినిమా ఓటీటీ లో ఇంత వరకు స్ట్రీమింగ్‌ కాలేదు. రెండు నెలలుగా ఓటీటీ ద్వారా ఈ సినిమాను చూడటం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నిర్మాత జ్ఞానవేల్‌ శుభవార్త చెప్పారు. కంగువా సినిమా ప్రమోషన్‌లో ఆయన తంగలాన్ అప్‌డేట్‌ ఇచ్చారు. కంగువా సినిమాను నవంబర్‌ 14న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా ఎక్స్‌ లో అభిమానులతో మాట్లాడిన నిర్మాత జ్ఞానవేల్‌ ను పలువురు తంగలాన్‌ ఓటీటీ ఎప్పుడంటూ ప్రశ్నించారు. నిర్మాతకి ఓటీటీ ప్లాట్‌ఫామ్ కి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఇప్పటి వరకు ఓటీటీ లో తీసుకు రాలేదన్న టాక్ ఉంది. తమిళ్‌‎కు చెందిన కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్ అదే విషయాన్ని ప్రచారం చేస్తున్నాయి. దాంతో నిర్మాత జ్ఞానవేల్‌ స్పందించారు. తంగలాన్‌ వంటి భారీ సినిమాను ప్రత్యేకమైన రోజుల్లో విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. తంగలాన్ సినిమాను ఎక్కువ మంది అభిమానులకు చేరవేసేందుకు గాను దీపావళి కానుకగా నెట్‌ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. అతి త్వరలోనే నెట్‌ ఫ్లిక్స్‌ నుంచి ఆ విషయమై క్లారిటీ రానుంది అంటూ ఆయన ప్రకటించారు.

Read Also:Pan Card: పాన్ కార్డు చిరునామాను మార్చాలనుకుంటున్నారా? ఇలా ఫాలో అయితే చాలు