Thangalaan : ఎట్టకేలకు ఆ ఓటీటీలోకి తంగలాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thangalaan : పా ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహించిన ‘తంగలాన్’ ఈ ఏడాది విడుదలైంది. ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ అందుకుంది. సమాజంలో అనేక చర్చలకు దారితీసింది. భారీ అంచనాల నడుమ ‘తంగలాన్’ సినిమా రూపొందింది. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. విక్రమ్, పా రంజిత్‌ల కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమా రూపొందింది. దీంతో కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఆగస్టు 15న ‘తంగలాన్’ థియేటర్లలో విడుదలైంది. విక్రమ్, పార్వతి తిరువొతు, మాళవిక మోహన్, పశుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. కోలార్ బంగారు క్షేత్రం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో మిశ్రమ స్పందన వచ్చింది.
Read Also:Election Commission: నేడు జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్..
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తంగలాన్ సినిమాను థియేటర్ లో చూడలేక పోయిన వారు ఓటీటీ లో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తంగలాన్ సినిమా ఓటీటీ లో ఇంత వరకు స్ట్రీమింగ్ కాలేదు. రెండు నెలలుగా ఓటీటీ ద్వారా ఈ సినిమాను చూడటం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నిర్మాత జ్ఞానవేల్ శుభవార్త చెప్పారు. కంగువా సినిమా ప్రమోషన్‌లో ఆయన తంగలాన్ అప్‌డేట్ ఇచ్చారు. కంగువా సినిమాను నవంబర్ 14న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఎక్స్ లో అభిమానులతో మాట్లాడిన నిర్మాత జ్ఞానవేల్ ను పలువురు తంగలాన్ ఓటీటీ ఎప్పుడంటూ ప్రశ్నించారు. నిర్మాతకి ఓటీటీ ప్లాట్‌ఫామ్ కి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఇప్పటి వరకు ఓటీటీ లో తీసుకు రాలేదన్న టాక్ ఉంది. తమిళ్‌కు చెందిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదే విషయాన్ని ప్రచారం చేస్తున్నాయి. దాంతో నిర్మాత జ్ఞానవేల్ స్పందించారు. తంగలాన్ వంటి భారీ సినిమాను ప్రత్యేకమైన రోజుల్లో విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. తంగలాన్ సినిమాను ఎక్కువ మంది అభిమానులకు చేరవేసేందుకు గాను దీపావళి కానుకగా నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ నుంచి ఆ విషయమై క్లారిటీ రానుంది అంటూ ఆయన ప్రకటించారు.
Read Also:Pan Card: పాన్ కార్డు చిరునామాను మార్చాలనుకుంటున్నారా? ఇలా ఫాలో అయితే చాలు
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!