Pawan Kalyan: ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్‌గా బన్నీవాస్‌ను నియమించారు.. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని బన్నీవాస్‌కు అందజేశారు జనసేనాని.. ఇక, పార్టీకి ప్రచార విభాగం కీలకమైందని, సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా.. పవన్ కల్యాణ్ సూచించారు. పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు.. పార్టీ ఉన్నతి కోసం మరింతగా కష్టపడాలని సూచిస్తూ.. ఈ సందర్భంగా బన్నీ వాస్‌కు శుభాకాక్షంలు తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Read Also: Parliament Attack: పక్కా ప్లాన్ ప్రకారమే పార్లమెంట్ పై దాడి.. వచ్చే ముందే దొరకకుండా ఫోన్లు ధ్వంసం
మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు నడుస్తోంది జనసేన.. ఇప్పటికే ఉమ్మడి కార్యాచరణపై పలు సమావేశాలు కూడా నిర్వహించారు.. ఒక్క సీటు కూడా వైసీపీకు వెళ్లకుండా పని చేయాలంటూ పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం విదితమే.. ఈ పొత్తు కనీసం ఓ దశాబ్దం కాలం పాటు ఉండాలి. దశాబ్ద కాలంపాటు పొత్తు ఉంటేనే రాష్ట్ర విభజన నష్టాన్ని, వైసీపీ పాలన విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోగలమ్మ ఆయన.. నా భవిష్యత్తు కోసం నేనేం చేయడం లేదు.. ఏపీ భవిష్యత్తు కోసమే నేను కృషి చేస్తున్నాను. పార్టీ బలోపేతం కోసం పని చేయాలి. నేను దశాబ్దకాలంగా పని చేస్తున్నాను. పల్లం వైపే నీరు వెళ్తుంది.. పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు దానంతట అదే వస్తుందంటూ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.