Tamil Nadu Minister: అక్రమ ఇసుక మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి, ఆయన కుమారుడి ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్న రూ.41.9 కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం తెలిపింది. మంత్రి విల్లుపురం జిల్లాలోని తిరుక్కోయిలూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన 49 ఏళ్ల కుమారుడు గౌతమ్ సిగమణి కల్లకురిచ్చి స్థానం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read: Fraud: కొందరు తమ భాగస్వాములను ఎందుకు మోసం చేస్తారో తెలుసా..!
ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థ, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మంత్రికి సంబంధించిన ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ”ఈడీ పీఎంల్‌ఏ, 2002 కింద 17/07/2023న ఎమ్మెల్యే, తమిళనాడు ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న కె. పొన్ముడికి చెందిన ఏడు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్ సిగమణికి చెందిన ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టింది.” అని మంత్రి రెండోసారి విచారణకు హాజరైన తర్వాత ఈడీ ట్వీట్ చేసింది. రాత్రిపూట దాదాపు ఏడు గంటలపాటు ప్రశ్నించిన తర్వాత తండ్రీకొడుకులు ఈ ఉదయం మాత్రమే కార్యాలయం నుంచి బయలుదేరారు. ”సోదాల సమయంలో, వివిధ నేరారోపణ పత్రాలు, నగదు మొత్తం రూ.81.7 లక్షల విలువైన విదేశీ కరెన్సీ (బ్రిటీష్ పౌండ్లు)ని స్వాధీనం చేసుకున్నాం. రూ. 13 లక్షల భారతీయ కరెన్సీ స్వాధీనం చేసుకున్నాం. రూ.41.9 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఫ్రీజ్ చేయబడ్డాయి.” అని ఈడీ తెలిపింది.
Also Read: NDA Meet: ప్రధాని మోడీ సమక్షంలో 38 పార్టీలతో ఎన్డీయే కూటమి భేటీ
బెంగుళూరులో జరిగిన మెగా ప్రతిపక్ష సమావేశం నుంచి దృష్టిని మళ్లించేందుకే కేంద్రం ఈ చర్యను చేపట్టిందని.. ఇది “రాజకీయ పగ” అని అధికార డీఎంకే అభివర్ణించింది. పొన్ముడి 2011లో మంత్రిగా ఉన్నప్పుడు అనుమతించదగిన పరిమితికి మించి 2.64 లక్షల ట్రక్కుల ఎర్ర ఇసుకను తవ్వినట్లు ఆరోపణలు వచ్చాయి.
