Site icon NTV Telugu

Coal Levy Case: బొగ్గు లెవీ కుంభకోణంలో ఐఏఎస్ అధికారి రాను సాహు అరెస్ట్

Coal Levy Case

Coal Levy Case

Coal Levy Case: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన బొగ్గు లెవీ కుంభకోణానికి సహకరించారనే ఆరోపణలతో ఐఏఎస్ అధికారిణి రాను సాహును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా పోస్ట్ చేయబడిన రాను సాహును కోర్టులో హాజరుపరచగా.. ఆమెను మూడు రోజుల ఈడీ కస్టడీకి పంపారు. ఈడీ 14 రోజుల కస్టడీని కోరగా.. కోర్టు జూలై 25 వరకు కస్టడీని మంజూరు చేసింది. అదనపు జిల్లా, సెషన్‌ జడ్జి అజయ్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ కేసులో అరెస్టయిన రెండో ఐఏఎస్ అధికారిణి రాను సాహు. కేంద్ర ఏజెన్సీ ఆమె ప్రాంగణంలో దాడులు నిర్వహించిన ఒక రోజు తర్వాత ఆమె అరెస్టు జరిగింది. అంతకుముందు రాను సాహు తరఫు న్యాయవాది ఫైజల్ రిజ్వీ విలేకరులతో మాట్లాడుతూ.. ఆమెను పూర్తిగా కల్పిత కారణాలతో అరెస్టు చేసినట్లు చెప్పారు.

Also Read: Short people: పొడవుగా ఉన్నవాళ్ల కంటే.. పొట్టిగా ఉన్నవాళ్లే ఎక్కువకాలం బ్రతుకుతారు..

రాష్ట్రంలోకి రవాణా చేయబడిన ప్రతి టన్ను బొగ్గుకు రూ. 25 బలవంతంగా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆమె గతంలో రాయ్‌గఢ్‌ వంటి బొగ్గు అధికంగా ఉండే ప్రాంతాలకు కలెక్టర్‌గా ఉన్న సమయంలో వసూల్లకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారిని రాను సాహును ఈడీ అరెస్ట్ చేసింది. 2010-బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Exit mobile version