NTV Telugu Site icon

Kiren Rijiju: ప్రొటెం స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్ ఆరోపణలు ఖండించిన కేంద్రమంత్రి

Krie

Krie

లోక్‌సభ ప్రొటెం స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దళిత వ్యక్తిని బీజేపీ అవమానించిందని హస్తం పార్టీ ధ్వజమెత్తింది. అత్యధిక సార్లు ఎంపీగా ఎన్నికైన కేరళ కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్‌ను కాకుండా ఒడిశా బీజేపీ ఎంపీ భర్తృ‌హరి మహతాబ్‌ను ఎంపిక చేయడంపై ఆరోపణలు గుప్పించింది.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: పవన్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. డయేరియా కట్టడిపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

అయితే కాంగ్రెస్ ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఖండించారు. 18వ లోక్‌సభ తొలి సెషన్‌ ప్రశాంతంగా జరగాలని తామంతా కోరుకుంటున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కోరిక కూడా ఇదేనన్నారు. ప్రత్యేక సెషన్‌లో ఎలాంటి చర్చలు ఉండవన్నారు.. కానీ ప్రొటెం స్పీకర్‌కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుందన్నారు. ప్రొటెం స్పీకర్‌ను నియమించే విషయంలో నిబంధనలను ఉల్లంఘించామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని.. కానీ నిబంధనల ప్రకారమే చేశామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజకీయాలు మానుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి: KTR : ‘అంబేద్కర్ అభయహస్తం’ హామీని ప్రభుత్వం అమలు చేయాలి

సోమవారం నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలతా ప్రమాణం స్వీకారం చేస్తారు. అనంతరం జూన్ 26న స్పీకర్ ఎంపిక జరగనుంది. అయితే ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశిస్తోంది. అది గనుక ఇవ్వకపోతే స్పీకర్ పోస్టుకు పోటీ చేస్తామని చెబుతోంది. తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ 293, ఇండియా కూటమి 233 స్థానాలు గెలుచుకుంది. మిత్ర పక్షాల సపోర్టుతో మోడీ సర్కార్ ఏర్పాటు చేశారు.