NTV Telugu Site icon

Rahul Gandhi : రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించిన ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్

New Project 2024 06 24t123912.784

New Project 2024 06 24t123912.784

Rahul Gandhi : కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ చేసిన రాజీనామా ఆమోదం పొందింది. సోమవారం 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభంలో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఈ సమాచారాన్ని అందించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి గెలిచారు. రెండింటిలో ఆయన రాయ్‌బరేలీ నుంచే కొనసాగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కేరళలోని వయనాడ్‌ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. రాహుల్‌ గాంధీ రాజీనామాను ఆమోదించినట్లు లోక్ సభ సెక్రటేరియట్‌ ప్రకటించింది. ఈ మేరకు బులిటెన్‌ విడుదల చేసింది. రాహుల్‌ వయనాడ్‌, రాయ్‌బరేలీ.. ఈ రెండు స్థానాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారని, వయనాడ్‌ ఎంపీగా ఆయన చేసిన రాజీనామాకు ఆమోదం లభించినట్లు పేర్కొంది.

Read Also:DGP Ravi Gupta: ట్రాఫిక్ నియంత్రణపై NSS వాలంటీర్లకు శిక్షణ.. నేడు మొదటి బ్యాచ్..

రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిస్తే.. ఎన్నికైన 14 రోజుల్లోగా ఒక స్థానాన్ని రాహుల్‌ వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో నిబంధనను అనుసరించి వయనాడ్‌ను వదులుకున్నారు. ఇకపై ఆయన రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగనున్నారు. దీంతో లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ బలం 99కి తగ్గింది. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో 99 సీట్లే వచ్చాయి. కానీ, మహారాష్ట్ర నుంచి ఎన్నికైన రెబల్ అభ్యర్థి కాంగ్రెస్‌కి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ లోక్‌సభ ఎంపీల సంఖ్య 100కు చేరుకుంది. ఇప్పుడు రాహుల్‌ రాజీనామాతో మళ్లీ 99కి తగ్గింది.

Read Also:Amarnath Yatra 2024: మీరు అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్నారా.? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..

మరోవైపు, రాహుల్‌ గాంధీ రాజీనామాతో వయనాడ్‌ సీటుకు జరగనున్న ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. దీంతో ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. వయనాడ్‌ నుంచి ప్రియాంక ఎన్నికైతే తొలిసారిగా ఆమె పార్లమెంటులోకి అడుగుపెడతారు. ఈ ఎన్నికలో గెలిస్తే ముగ్గురు గాంధీలు (సోనియా, రాహుల్‌, ప్రియాంక) ఒకే టైంలో పార్లమెంటులో ఉన్నట్లవుతుంది.