NTV Telugu Site icon

Wayanad: ఎల్లుండి ప్రియాంక గాంధీ నామినేషన్‌.. పాల్గొననున్న సోనియా, రాహుల్ గాంధీ

Priyanka

Priyanka

కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఎల్లుండి (బుధవారం) ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో.. వయనాడ్‌లో పెద్ద ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ర్యాలీలో ప్రియాంక గాంధీతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కల్‌పేట కొత్త బస్టాండ్‌ నుంచి రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్‌షో నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రియాంక గాంధీ నామినేషన్‌కు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత వారం ఎన్నికల సంఘం వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికను ప్రకటించిన సంగతి తెలిసిందే..

Unstoppable With NBK : ఆకాశంలో సూర్య చంద్రులు ఏపీలో బాబు, కళ్యాణ్ బాబు

ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాయనాడ్ సీటును రాహుల్ గాంధీ వదిలేయడంతో.. ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. మరోవైపు.. వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రియాంక గాంధీకి స్వాగతం పలుకుతూ పోస్టర్లు వెలిశాయి. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని నిలుపుకుంటారని.. కేరళలోని వాయనాడ్ స్థానాన్ని ఖాళీ చేస్తారని, వాయనాడ్ నుండి ప్రియాంక గాంధీ ఎన్నికలకు అరంగేట్రం చేస్తారని కాంగ్రెస్ జూన్‌లోనే ప్రకటించింది.

Cyclone Alert: ఏపీకి దూసుకొస్తున్న తుఫాను.. ముందస్తుగా చర్యలు

ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గెలిస్తే ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. గాంధీ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు సోనియా, రాహుల్‌, ప్రియాంక కలిసి పార్లమెంటుకు రావడం కూడా ఇదే తొలిసారి. ప్రియాంక గాంధీపై ఉప ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకేరి బరిలోకి దిగనున్నారు. బీజేపీ నుంచి నవ్య హరిదాస్ బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండటంతో ప్రియాంక గాంధీకి గట్టి పోటే ఉండనుంది.