Site icon NTV Telugu

Congress: కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ వాయిదా

Congress

Congress

కొల్లాపూర్‌లో ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ప్రియాంక గాంధీ బహిరంగ సభ మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ఈ సభను రద్దు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరిక మరింత ఆలస్యమవుతుంది. కాగా ఈనెల 20న జరగాల్సిన సభను 30కి వాయిదా వేశారు. కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో సభకు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: Manipur Women Video: మణిపూర్‌ మహిళల వేధింపుల ఘటన.. కేసు సీబీఐకి అప్పగింత

మరో రెండు రోజులు రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉండడంతో కాంగ్రెస్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జన సమీకరణ కూడా కష్టమయ్యే పరిస్థితి ఉండటంతో ఈ సభను రద్దు చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక సభకు సంబంధించిన తదుపరి తేదీని వెల్లడిస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఇక ఈసారి ఎలాగైనా తెలంగాణలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు రకాల డిక్లరేషన్ లను ప్రకటించి.. జనాల్లోకి తీసుకెళ్తోంది. ఇదే సమయంలో ఆపరేషన్ ఆకర్షన్ పై గురి పెట్టింది.

Read Also: Sai Dharam Tej: పవన్ ఎంట్రీ అప్పుడే.. మీ చొక్కాలు చింపుకోండి కానీ పక్కనోళ్ళవి కాదు!

అయితే, ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటంతో పాటు… పలు కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇక మాజీ మంత్రి జూపల్లితో పాటు ఇతర నేతలు కూడా పార్టీలోకి రాబోతున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో కొల్లాపూర్ వేదికగా జాయిన్ కావాలని నిర్ణయించారు. ఇప్పటికే వాయిదా పడగా… జులై 30న కూడా నిర్వహించే అవకాశాలు లేకపోవడంతో మరోసారి కూడా వాయిదా వేశారు.

Read Also: Health Department: అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ.. వైద్య సిబ్బంది సెల‌వులు ర‌ద్దు

అయితే సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పనులు మొదలుపెట్టగా… సభకు ‘పాలమూరు ప్రజాభేరి’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే వచ్చే నెల ఐదో తేదీన సభను నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇక కొల్లాపూర్ సభ వేదికగానే మహిళల అభ్యున్నతి కోసం మహిళా డిక్లరేషన్ ప్రకటించాలని టీపీసీసీ చూస్తోంది. పెద్ద ఎత్తున చేరికలకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేష్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా చేరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరిత తదితర అనేక మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Exit mobile version