ప్రియాంక చోప్రా ఎట్టకేలకు తన కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్‌కు సంబంధించి వివరించింది. అయితే గతంలో మాల్తీ ముఖం కనిపించకుండా.. ఫోటోలను షేర్ చేసింది. అయితే.. మాల్తీ ఆరు నెలలకే జన్మించడం, ఎందుకు సరోగసీ మార్గాన్ని ఎంచుకుందనే దాని గురించి ప్రియాంక స్పందించింది. ప్రియాంక తన కూతురికి మాల్తీ అని పేరు పెట్టింది. నిర్ణీత సమయానికి మూడు నెలల ముందుగానే బిడ్డ పుట్టిందని కొన్ని వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈ విషయాన్ని ప్రియాంక కూడా అంగీకరించింది. ‘మాల్తీ పుట్టినప్పుడు నేను ఆపరేషన్ గదిలో ఉన్నాను. ఆమె చాలా చిన్నది. ఆమె నా చేతి కంటే చిన్నది. ఆమెను ఇంటికి తీసుకురావడానికి ముందు మేము ఆమెను ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చింది.
Also Read : Kishan Reddy: ఇప్పటి వరకు అగ్ని ప్రమాదాలైన బిల్డింగ్ లన్నీ అక్రమ కట్టడాలే
మేము రెగ్యులర్ గా హాస్పిటల్ కి వెళ్లేవాళ్లం’ ప్రియాంక చోప్రా తెలిపింది. ఇదేకాకుండా.. సరోగసీని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు ప్రియాంక సమాధానమిచ్చింది. “నా స్వంత ఆరోగ్య సమస్యలు ఉన్నాయి” అని ప్రియాంక చెప్పుకొచ్చింది. అయితే.. గతంలో ప్రియాంక సరోగసీ ఎంచుకున్నప్పుడు ఆమె తన అందం తగ్గకుండా ఉండేందుకు సరోగసీ ఎంచుకుందని, ఆమె వయసు ఎక్కువగా ఉండడం వల్ల సరోగసీ ఎంచుకుందని భిన్న వాదనలు వినిపించారు. అయితే.. ఇప్పుడు ప్రియాంక ఇచ్చిన సమాధానంతో భిన్న వాదనలకు తెరపడింది. అయితే.. ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని పెళ్లాడి అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం ప్రియాంక పలు హాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్నారు.
Also Read : Motion sickness Tips : జర్నీల్లో వచ్చే వాంతులను తగ్గించే చిట్కాలు
