Site icon NTV Telugu

Priyanka Chopra: నేను వెళ్తున్న.. మీరు వస్తున్నారా..? మందాకిని స్పెషల్ వీడియో..!

Priyanka Chopra

Priyanka Chopra

Priyanka Chopra: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు టాలీవుడ్ జక్కన్నగా పిలిచే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా సంబంధించిన ఈవెంట్ నేడు రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు ‘గ్లోబల్ ట్రాటర్’ (GlobeTrotter) గా నామకరణం చేశారు చిత్ర బృందం. ఇక ఈవెంట్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఈ ఈవెంట్ సంబంధించి రాజమౌళి పెద్ద ఎత్తున ప్లాన్ చేసి.. సినిమాకు సంబంధించిన కొన్ని వివరాలను తెలపనున్నాడు. ఇక ఈవెంట్ కు హాజరయ్యేందుకు రాజమౌళి తనదైన స్టైల్ లో ఓ పాస్ పోర్ట్ ఆకారపు ఎంట్రీపాసులు క్రియేట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

SBI mCASH: కస్టమర్లకు అలర్ట్.. ఆ సర్వీస్ ను నిలిపివేయనున్న SBI.. ఎప్పటినుంచంటే?

ఇక ఈవెంట్ కు సంబంధించిన వివరాలను తానే స్వయంగా ఓ వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆ వీడియోలో ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది..? అక్కడికి ఎలా చేరుకోవాలి? అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వివరించారు. ఆ తర్వాత అదే వివరాలను హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈవెంట్ సంబంధించిన వివరాలను తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశాడు.

Betting Apps Case : సీఐడీ విచారణకు హాజరైన దగ్గుబాటి రాణా..

ఇక సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే రోల్ లో నటిస్తోంది. ఆమె కూడా తాజాగా సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో తాను ఈవెంట్ కు వెళ్తున్నాను.. మీరు కూడా ఈవెంట్ కు వచ్చేయండి సేఫ్ గా అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version