NTV Telugu Site icon

Priyanka Chopra : అయోధ్య రాముడిని దర్శించుకున్న గ్లోబల్ బ్యూటీ.. ఫోటోలు వైరల్..

Priyanka Chopra (2)

Priyanka Chopra (2)

బాలీవుడ్ క్వీన్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది..ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు.. హాలీవుడ్ పాప్ సింగర్ ‘నిక్ జోనాస్’ని పెళ్లి చేసుకొనే అక్కడే సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫిషనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది.. బాలీవుడ్ ప్రేక్షకులను సోషల్ మీడియాలో పలకరిస్తుంది.. తాజాగా ప్రియాంక చోప్రా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఫోటోలు ఒకటి సోషల్ లో తెగ వైరల్ అవుతున్నాయి..
ప్రియాంక చోప్రా తన ఫ్యామిలీతో కలిసి ఇండియాకు వచ్చారు. కొన్ని రోజుల క్రితమే వచ్చిన వాళ్లు పార్టీలకు, ఈవెంట్స్ కు హాజరువుతూ వస్తోంది.. ఇటీవల ముంబైలో ఓ ఈవెంట్ కు వెళ్లిన ప్రియాంక తన లుక్ తో అందరిని ఆకట్టుకోవడం మాత్రమే కాదు.. తన ఖరీదైన నగలతో అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇషా అంబానీ ఏర్పాటు చేసిన హోలీ పార్టీలో కూడా ప్రియాంక ఫ్యామిలీ సందడి చేసారు. తాజాగా ప్రియాంక ఫ్యామిలీ తో కలిసి అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఆ ఫోటోలలో ప్రియాంక చోప్రా ట్రెడిషినల్ లుక్ లో కనిపించింది.. తన భర్త కూతురు కూడా చాలా అందంగా ఉన్నారు.. రాముడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆశీసులను అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. ఈ ఫోటోలను ప్రియాంక ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.. ప్రియాంక సినిమాల విషయానికొస్తే.. వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది.. మీరు ఒక లుక్ వెయ్యండి..