Priyanka Chopra on Upcoming Documentary Tiger: ప్రకృతికి సంబంధించిన సినిమాలకు తాను పెద్ద అభిమానిని అని నటి ప్రియాంక చోప్రా జోనాస్ తెలిపారు. గళాన్ని (వాయిస్ ఓవర్) అందించాలనే తన కోరిక ‘టైగర్’తో నెరవేరిందని చెప్పారు. హాలీవుడ్, బాలీవుడ్‌లో రాణిస్తున్న ప్రియాంక.. త్వరలో విడుదల కానున్న టైగర్ అనే డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకు తన గొంతు అరువిచ్చారు. ఏప్రిల్ 22న డిస్నీ+ హాట్‌స్టార్‌లో టైగర్ ప్రసారం ప్రారంభమవుతుంది.
ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ టైగర్‌పై స్పందించారు. ‘ప్రకృతికి సంబంధించిన సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్. భారతదేశం నుంచి వస్తున్న టైగర్‌కు నా గొంతుతో ప్రేక్షకులకు దగ్గరవ్వడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఓ నటిగా ఆడియో విజువల్ మాధ్యమానికి అలవాటు పడ్డా. ఇప్పుడు కేవలం నా వాయిస్‌తోనే భావోద్వేగాలను పండించగలగాలి. తొలిసారి ఓ సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. ఇది సవాలుతో కూడిన పని. నా గళాన్ని అందించాలనే నా కోరిక టైగర్‌తో నెరవేరింది’ అని ప్రియాంక తెలిపారు.
Also Read: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుంచి క్రేజీ అప్డేట్.. వారం రోజులు పాటు..!
ఇదివరకు ఫ్రోజెన్ 2, ది జంగిల్ బుక్ మరియు ప్లేన్స్ కోసం ప్రియాంక చోప్రా తన గాత్రాన్ని అందించారు. తాజాగా టైగర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఒక పులి ఎనిమిదేళ్ల జీవితం ఆధారంగా టైగర్ రూపిందింది. భారతదేశంలోని కల్పిత అడవులలో తన పిల్లలను పెంచుతున్న ఒక యువ పులి అంబర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. టైగర్‌కు మార్క్ లిన్‌ఫీల్డ్ దర్శకత్వం వహించారు. వెనెస్సా బెర్లోవిట్జ్, రాబ్ సుల్లివన్ సహ-దర్శకత్వం వహించగా.. లిన్‌ఫీల్డ్, బెర్లోవిట్జ్, రాయ్ కాన్లీ నిర్మించారు.