Citadel Season 2: యాక్షన్‌లోకి దిగిన ప్రియాంక చోప్రా.. ‘సిటాడెల్’ సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్, రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ప్యాక్డ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. మొదటి సీజన్‌తోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సిరీస్, ఇప్పుడు రెండో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సిరీస్ మేకర్స్ సీజన్ 2 కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ సీజన్ మే 6, 2026 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Also Read : Mega 158: మెగాస్టార్‌కు విలన్‌గా డింపుల్ హయాతి?
Also Read
- 8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
రెండో సీజన్‌కు సంబంధించి విడుదలైన అధికారిక ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. “టైమ్ టు లెవల్ అప్” (Time to level up) అంటూ మేకర్స్ ఈ సీజన్లో యాక్షన్ డోస్ మరింత ఎక్కువగా ఉంటుందని హింట్ ఇచ్చారు. నాడియా సిన్హ్ పాత్రలో ప్రియాంక చోప్రా తన అదిరిపోయే స్టంట్స్‌తో మరోసారి మెప్పించబోతోంది. మేసన్ కేన్ (రిచర్డ్ మాడెన్), బెర్నార్డ్ ఓర్లిక్ (స్టాన్లీ టుక్కీ)తో కలిసి సరికొత్త మిషన్‌ను ఎలా ఎదుర్కొన్నారనేది ఈ సీజన్ కథాంశం. సిటాడెల్ సీజన్ 2 లో మొత్తం ఏడు ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. విశయం ఏంటంటే, ఈ ఏడు ఎపిసోడ్లను మే 6వ తేదీన ఒకేసారి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సీజన్లో కొత్తగా జాక్ రేనర్, మ్యాట్ బెర్రీ వంటి హాలీవుడ్ నటులు చేరారు. రూసో బ్రదర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సిరీస్ కోసం ఇండియన్ ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే ప్రియాంక తన హాలీవుడ్ కెరీర్‌లో ఈ పాత్రతోనే అత్యధిక క్రేజ్ సంపాదించుకున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!