Mega 158: మెగాస్టార్‌కు విలన్‌గా డింపుల్ హయాతి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘వాల్తేరు వీరయ్య’తో మ్యాజిక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి మళ్ళీ చేతులు కలిపారు. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను ముగించుకుని షూటింగ్‌కు సిద్ధమవుతోంది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉండగా, నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో చిరు సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ చిత్రానికి సంబంధించి తాజాగా వినిపిస్తున్న ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Also Read : Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’లో ఫుల్ లెంగ్త్ కామెడీ..
Also Read
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బోల్డ్ బ్యూటీ డింపుల్ హయాతిని (Dimple Hayathi) ఎంపిక చేసినట్లు సమాచారం. సాధారణంగా డింపుల్ హయాతి అంటే గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్. కానీ బాబీ ఈ సినిమాలో ఆమెను సరికొత్తగా చూపించబోతున్నారట. ఇందులో ఆమె హీరోయిన్ కాదు అని, నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. మెగాస్టార్ వంటి దిగ్గజ నటుడికి ఎదురు నిలిచే పాత్ర కావడంతో డింపుల్ రోల్ చాలా ఇంటెన్సివ్‌గా ఉండబోతోందట. ఈ డిఫరెంట్ కాస్టింగ్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని ఫిలిం నగర్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఈ సినిమా కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా, స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగనుందని సమాచారం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట. ఈ ఫ్లాష్‌బ్యాక్ కోసం మెగాస్టార్ ఒక సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారని, బాబీ ఈ పాత్రను చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశారని టాక్.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!