NTV Telugu Site icon

Engagement : పెళ్లికి రెడీ అంటున్న పరిణీతి.. అతనితోనే ఎంగేజ్ మెంట్

Priyanka

Priyanka

Engagement : కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తి గా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో సోషల్ మీడియాలో పరిణీతి, రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం వైరల్ అవుతోంది. పుకార్లకు నేటితో చెక్ పెట్టనున్నారు. పరిణీతి చోప్రా రాఘవ్ చద్ధాల నిశ్చితార్థ వేడుక మే 13న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవనున్నట్టు తెలుస్తోంది. సిక్కు ఆచారాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుందని సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఆర్దాస్ తర్వాత సుఖ్మణి సాహిబ్ తో ఈ వేడుక ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఈ వేడుకలో ప్రియాంకతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొననున్నట్టు సమాచారం.

Read Also:Maharastra: భార్య మాటవిని.. మెచ్యూర్‌ అయిన చెల్లెల్ని కొట్టి చంపిన అన్న

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్ధాల నిశ్చితార్థ వేడుక కోసం నటి ప్రియాంక చోప్రా ఢిల్లీ చేరుకున్నారు. అభిమానులు, ఫొటోగ్రాఫర్స్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కారులో అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో ప్రియాంక లేత గోధుమరంగు స్వెట్‌షర్ట్, మ్యాచింగ్ ప్యాంట్‌లను ధరించింది. తలపై నల్లటి టోపీ, మ్యాచింగ్ షూస్, డార్క్ సన్ గ్లాసెస్ కూడా ధరించింది. భుజానికి నల్ల బ్యాగ్‌ వేసుకుని.. కారు వైపు వెళుతుండగా, ఆమె ఒక చిరునవ్వు నవ్వి… ఫొటోగ్రాఫర్లకు రెండు చేతులు జోడించి నమస్కరించింది. దాంతో పాటు ఆమె తల ఊపుతూ ‘నమస్తే ‘ అని చెప్పి కారులో బయలుదేరింది. అంతకుముందు, ప్రియాంక లండన్ విమానాశ్రయంలో అభిమానులకు పోజులిచ్చిన పలు ఫొటోలు దిగింది. ఇవి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా వీరి నిశ్చితార్థ వేడుక ఏర్పాట్లకు సంబంధించి పలు ఫొటోలు బయటికొచ్చాయి. వీటిల్లో రాఘవ్ చద్దా ఇంటిని పువ్వులు, లైట్లతో అలంకరించారు. అంతకుముందు ముంబైలోని పరిణీతి ఇంటిని కూడా లైట్లతో అలంకరించారు.

Read Also:TS Government: జేపీఎస్ లకు లాస్ట్ ఛాన్స్.. మధ్యాహ్నం 12 వరకు రాకపోతే లిస్ట్ లో లేనట్టే

Show comments