NTV Telugu Site icon

Priyamani: హీరోయిన్ ను ఆంటీ అన్న నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన బ్యూటీ

Family Man-2 : Priyamani Says that all that will be revealed in this Season

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయిపోవడంతో కొంతమంది నెటిజన్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. సెలబ్రెటీలు అంటే ఏదో పబ్లిక్ ప్రాపర్టీ వారిపై అందరికి హక్కు ఉంటుంది అన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. వీటి వల్ల చాలా మంది సెలబ్రెటీలు ఇబ్బందిపడుతున్నారు. కొంతమంది సైలెంట్ గా ఇలాంటి వాటిని లైట్ తీసుకుంటుంటే మరికొందరు మాత్రం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.  ఆంటీ.. ఈ పదం వినగానే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది ప్రముఖ యాంకర్, నటి అనసూయ. ఎందుకంటే మొన్నీమధ్య ఈ ఆంటీ అనే పదంతో ఆమెను తెగ ఆడేసుకున్నారు నెటిజన్లు. అయితే ఆమె కూడా ఈ కామెంట్స్ కు గట్టిగానే రిప్లై ఇచ్చింది. సరే ఇక ఈ ఆంటీ వ్యవహారం అయిపోయిందిలే అనుకుంటే ఇప్పుడు ఇదే పేరుతో హీరోయిన్ ప్రియమణిని టార్గెట్ చేశారు కొందరు నెటిజన్లు.

Also Read: Telangana Congress: నేడు కాంగ్రెస్ లో భారీ చేరికలు.. కండువా కప్పుకోనున్న రేఖానాయక్, వేముల

పదేళ్ల పాటు సినిమాల్లో హీరోయిన్ గా రాణించిన ప్రియమణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో తన పాత్రకు పాధ్యాన్యత ఉండే క్యారెక్టర్లను చేస్తోంది. ఇక ప్రియమణి చేస్తున్న పోస్ట్ లపై కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ప్రియమణిని బ్లాక్ ఆంటీ అంటూ పిలుస్తున్నారు. మొదట వీటిని లైట్ తీసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఘాటుగానే రిప్లై ఇచ్చింది. తనను ఆంటీ అని పిలవడాన్ని తాను పట్టించుకోనని చెబుతూనే నెటిజన్ పై మండిపడింది. తన వయసు ప్రస్తుతం 38 సంవత్సరాలని ఈ వయసులో కూడా తాను హాట్ గా ఉన్నానన్న ప్రియమణి ఇక చాలు నోరు మూసుకో అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. నన్ను ఆంటీ అని కామెంట్‌ చేయటంలో ఎలాంటి తప్పు లేదు. ఎలాంటి అభ్యంతరం లేకుండా నన్ను ఆంటీ అని పిలవచ్చు. వయసు పెరిగితే సిగ్గు పడాల్సిన అవసరం లేదు. వయసు పెరగడం అనేది  సహజ సిద్ధంగా జరిగే పక్రియ అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.  ప్రియమణి ఇలా స్పందించడంపై చాలా మంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేస్తూ వస్తోన్న  ప్రియమణి తాజాగా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రంలో నటించింది.