NTV Telugu Site icon

Darling Pre Release Event: అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నాని: ప్రియదర్శి

Priyadarshi Nani

Priyadarshi Nani

Nabha Natesh Said Darling Movie is Paisa Vasool Entertainment: ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలనుకునే ఇప్పటి జనరేషన్‌కి ‘నాని’ అన్న పెద్ద ఇన్‌స్పిరేషన్‌ అని నటుడు ప్రియదర్శి అన్నారు. చిన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి యాక్టర్ కావాలనుకున్నానని తెలిపారు. డార్లింగ్ చిత్రంతో తెలుగు సినిమా అశ్విన్ రామ్‌ని అడాప్ట్ చేసుకుంటుందన్నారు. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకు అనుకున్నదాని కంటే ఎక్కువ ఫన్ ఇస్తాం అని ప్రియదర్శి చెప్పారు. ప్రియదర్శి, నభా నటేశ్‌ జంటగా నటించిన చిత్రం డార్లింగ్. అశ్విన్‌ రామ్‌ దర్శకుడు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, చైతన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ‘డార్లింగ్‌’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగ్గా.. హీరో నాని, శివలెంక కృష్ణప్రసాద్, అనన్య నాగళ్ల, అభినవ్‌ గోమఠం, వివేక్‌ కూచిభొట్ల, బలగం వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ… ‘అందరికీ నమస్కారం. చిన్నప్పుడు చిరంజీవి గారిని చూసి యాక్టర్ అవ్వాలనుకున్నా. అప్పుడు చిరంజీవి ఇన్‌స్పిరేషన్‌ అయితే.. ఇప్పుడు నాని అన్న ఇన్‌స్పిరేషన్‌. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలనుకునే ఇప్పటి జనరేషన్‌కి నాని అన్న ఇన్‌స్పిరేషన్‌. కల్కి సినిమాలా ఆలోచిస్తే.. నాని అన్న రధం నడిపే కృష్ణుడైతే ఆ దారిలో వెళ్లే అర్జునుడిలా, నాని అన్నని ఫాలో అవుతున్నా. ఇంత ఇన్‌స్పిరేషన్‌ ఇస్తున్నందుకు ఆయాబాకు థాంక్యూ. ఈ వేడుకకు అతిథిగా వచ్చిన శివలెంక కృష్ణప్రసాద్ గారితో పాటు అందరికీ థాంక్యూ. అశ్విన్ రూపంలో నాకో బ్రదర్ దొరికాడు. డార్లింగ్‌తో తెలుగు సినిమా అశ్విన్‌ని అడాప్ట్ చేసుకుంటుంది. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నిరంజన్ గారు, చైతన్య గారు ఈ కథని నమ్మారు. వారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. వివేక్ సాగర్, విష్ణు, నరేష్, అనన్య, జీవన్ అన్న, కాసర్ల శ్యామ్, శీతారాం అన్న.. టీం అందరికీ పేరుపేరునా థాంక్స్. నభా నటేశ్‌ తన ప్రతిభతో నా పాత్రని పరిపూర్ణం చేశారు. ఇంకో 20 ఏళ్లు కొనసాగేంత ప్రతిభ తనలో ఉంది. ప్రేక్షకులు మాకిస్తున్న ప్రేమని రెండితలుగా తిరిగివ్వాలని నేను అనుకుంటున్నాను. జూలై 19న మీరు థియేటర్‌కి వస్తే మా టీం తరపున మీరు అనుకున్నదాని కంటే ఎక్కువ ప్రేమ ఇస్తా. ఐ లవ్ యూ అల్’ అని చెప్పాడు.

Also Read: Hero Nani: ఈ పదేళ్లలో నాకు ఇష్టమైన సినిమా అదే: హీరో నాని

హీరోయిన్ నభా నటేశ్‌ మాట్లాడుతూ… ‘నానికి గారిని నేను పెద్ద అభిమానిని. ఆయన ఈ వేడుకకి రావడం చాలా ఆనందంగా ఉంది. డార్లింగ్‌ సినిమా నాకొక భావోద్వేగం. ఇందులో నా డ్రీం రోల్ చేశాను. కష్ట సమయంలో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఇది. రోజూ ఓ సాహసంలా, ఓ ప్రత్యేకమైన అనుభవంలా ఉండేది. అశ్విన్‌ రామ్ స్క్రిప్ట్ చాలా బాగా రాశారు. ఇంకా గొప్పగా తీశారు. జూలై 19న డార్లింగ్ మ్యాజిక్ చూస్తారు. ప్రియదర్శి వల్ల ఈ పాత్ర నాకు మరింత ప్రత్యేకమైన సినిమా అయ్యింది. నిరంజన్ గారు, చైతన్య గారు కథని నమ్మరు. హనుమాన్ సక్సెస్‌ని డార్లింగ్ కంటిన్యూ చేస్తుంది. అమ్మా నాన్నల సపోర్ట్ లేకపోతే ఇక్కడివరకూ వచ్చేదాన్ని కాదు. డార్లింగ్ 19న వస్తోంది. పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ వుంటుంది. మళ్ళీ మళ్ళీ చూస్తారు’ అన్నారు.