Priyadarshi : “గేమ్ ఛేంజర్” కోసం 25 రోజుల కాల్షీట్లు ఇచ్చా.. మొత్తం లేపేశారు
- ఆ మూవీ కోసం ఎంతో కష్టపడ్డా
- ఆ హీరోతో సినిమా చేయాలని చూస్తున్నా
- ప్రియదర్శి కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyadarshi : నటుడు ప్రియదర్శి గేమ్ ఛేంజర్ సినిమా మీద సంచలన కామెంట్లు చేశారు. ఆ సినిమా కోసం తాను కష్టపడ్డా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రియదర్శి హీరోగా నాని నిర్మాతగా రామ్ జగదీశ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కోర్ట్ః స్టేట్ వర్సెస్ నోబడీ. ఈ మూవీలో శివాజీతో పాటు కొందరు కీలక నటులు యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శి చాలా విషయాలను పంచుకున్నాడు. “నేను గేమ్ ఛేంజర్ సినిమా కోసం 25 రోజుల కాల్షీట్లు ఇచ్చాను. కానీ 2 నిముషాలు కూడా అందులో లేను. నా పాత్ర సీన్లు ఎడిటింగ్ లో పోయాయి. అయినా సరే నాకు బాధలేదు. శంకర్ తో సినిమా చేయాలన్నది నా కల. రామ్ చరణ్ అన్నతో, తిరుతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అది ఆ సినిమా ద్వారా తీరిపోయింది” అంటూ చెప్పుకొచ్చాడు.
Read Also : Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి కోర్టులో భారీ ఊరట..
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
శంకర్ తో నేను డైరెక్టుగా సినిమా చేయలేకపోయినా.. ఆయనతో పనిచేసే అవకాశం దొరికినందుకు సంతోషపడుతున్నానని వివరించాడు. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా ప్లాప్ అయినా.. దానికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారని.. అందులో తాను కూడా ఒకడినని చెప్పాడు. “ఇదే విషయాన్ని నేను రామ్ చరణ్ అన్నతో చెప్పినప్పుడు చాలా సంతోషించాడు. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ను చూస్తే.. ఆ పవర్ మనకు కూడా వచ్చేస్తుంది. వకీల్ సాబ్ మూవీలో పవన్ కల్యాణ్ టీవీ, ఆరా నాకు బాగా నచ్చాయి” అన్నాడు ప్రియదర్శి. చిరంజీవితో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నానని.. వాల్తేరు వీరయ్య సినిమాలో పాత్రకోసం అడిగి.. చివరకు ఆ పాత్రనే లేదని చెప్పడంతో సైలెంట్ అయ్యానని అన్నాడు. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబోలో వచ్చే సినిమాలో ఛాన్స్ అడుగుతానన్నాడు.
Read Also : Exclusive: రవితేజ కొడుకు హీరో అవుతాడు అనుకుంటే ఇలా చేశాడు ఏంటి?
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!