Priyadarshi : నటుడు ప్రియదర్శి గేమ్ ఛేంజర్ సినిమా మీద సంచలన కామెంట్లు చేశారు. ఆ సినిమా కోసం తాను కష్టపడ్డా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రియదర్శి హీరోగా నాని నిర్మాతగా రామ్ జగదీశ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కోర్ట్ః స్టేట్ వర్సెస్ నోబడీ. ఈ మూవీలో శివాజీతో పాటు కొందరు కీలక నటులు యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శి చాలా విషయాలను పంచుకున్నాడు. “నేను గేమ్ ఛేంజర్ సినిమా కోసం 25 రోజుల కాల్షీట్లు ఇచ్చాను. కానీ 2 నిముషాలు కూడా అందులో లేను. నా పాత్ర సీన్లు ఎడిటింగ్ లో పోయాయి. అయినా సరే నాకు బాధలేదు. శంకర్ తో సినిమా చేయాలన్నది నా కల. రామ్ చరణ్ అన్నతో, తిరుతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అది ఆ సినిమా ద్వారా తీరిపోయింది” అంటూ చెప్పుకొచ్చాడు.
Read Also : Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి కోర్టులో భారీ ఊరట..
శంకర్ తనతో డైరెక్టుగా సినిమా చేయలేకపోయినా.. ఆయనతో పనిచేసే అవకాశం దొరికినందుకు సంతోషపడుతున్నానని వివరించాడు. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా ప్లాప్ అయినా.. దానికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారని.. అందులో తాను కూడా ఒకడినని చెప్పాడు. “ఇదే విషయాన్ని నేను రామ్ చరణ్ అన్నతో చెప్పినప్పుడు చాలా సంతోషించాడు. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ను చూస్తే.. ఆ పవర్ మనకు కూడా వచ్చేస్తుంది. వకీల్ సాబ్ మూవీలో పవన్ కల్యాణ్ టీవీ, ఆరా నాకు బాగా నచ్చాయి” అన్నాడు ప్రియదర్శి. చిరంజీవితో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నానని.. వాల్తేరు వీరయ్య సినిమాలో పాత్రకోసం అడిగి.. చివరకు ఆ పాత్రనే లేదని చెప్పడంతో సైలెంట్ అయ్యానని అన్నాడు. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబోలో వచ్చే సినిమాలో ఛాన్స్ అడుగుతానన్నాడు.
Read Also : Exclusive: రవితేజ కొడుకు హీరో అవుతాడు అనుకుంటే ఇలా చేశాడు ఏంటి?