వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఇటీవల `బ్రో` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇందులో ప్రాధాన్యత కలిగిన పాత్రలోనే కనిపించింది.. మొదటి సినిమాలో ఒక్క కన్నుగీటుతోనే నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యింది. క్రేజీ బ్యూటీగా నిలిచింది. ఆ ఒక్క సీన్ ఈ బ్యూటీని స్టార్‌ని చేసింది. అదే ఈ అమ్మడికి వరుసగా అవకాశాలను తెచ్చిపెట్టింది. దీంతో ఏడాదిలోనే ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది.. వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ జనాలను తెగ ఆకట్టుకుంటుంది..
తెలుగులో నితిన్‌తో `చెక్` చిత్రంలో నటించింది. హీరోయిన్‌గా మెరిసింది. నితిన్‌కి జోడీగా మెప్పించింది. ఆయనకు లవ్ ఇంట్రెస్ట్ గా కాస్త గ్లామరస్ పాత్రలోనే మెరిసింది. కానీ ఆ సినిమా హిట్ కాలేదు. దీంతోపాటు `ఇష్క్` అనే చిత్రంలోనూ నటించింది. అది కూడా మెప్పించలేకపోయింది. దీంతో తెలుగులో ఈ బ్యూటీని పట్టించుకోలేదు.. దాంతో మూడేళ్లు గ్యాప్ తీసుకుంది..పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన `బ్రో` చిత్రంలో కీలక పాత్రలో నటించింది. సాయికి చెల్లిగా నటించింది. ప్రేమకోసం అన్నను ఎదురించి ఇంటి నుంచి వెళ్లిపోయే పాత్రలో కనిపించింది ప్రియా నటించింది.. సినిమా ఎలా ఉన్నా ఈ అమ్మడుకు మాత్రం మంచి పేరు దక్కింది..
ఇక సినిమాలు పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె హాట్ డోస్ పెంచుతూ అలరిస్తుంది. తాజాగా మెరిసే దుస్తులు ధరించింది. ఆ షైనింగ్ లుక్‌లో మరింత మెరిసిపోతుంది.. హాట్ లుక్స్ తో తెగ టెంప్ట్ చేస్తుంది.. ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో బిజీగా ఉంది. అక్కడ రెండు మూడు సినిమాలు చేస్తుంది. మరోవైపు తెలుగు ప్రాజెక్ట్ లకు కూడా చర్చలు జరుపుతున్నాయట.. బాలివుడ్ లో క్రేజ్ పెరుగుతుందేమో చూద్దాం..