Site icon NTV Telugu

Priya Prakash Varrier : అస్సలు హీరోయిన్ అవుతానని అనుకోలేదు..

Whatsapp Image 2023 10 07 At 10.42.32 Am

Whatsapp Image 2023 10 07 At 10.42.32 Am

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒరు అదార్ లవ్ సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ చిత్రంలో ఆమె నటనతో కన్నుకొట్టే ఎక్స్‏ప్రెషన్‏ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.మొదటి సినిమా తోనే సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. మలయాళంలో విడుదలైన ఈ మూవీ ఆ తర్వాత తెలుగుతోపాటు మిగత భాషల్లో కూడా డబ్ అయి మంచి విజయం సాధించింది. ఈ తర్వాత ప్రియాకు అంతగా అవకాశాలు అయితే రాలేదు. అప్పుడప్పుడు నటించిన చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవలే ఈ భామ బ్రో సినిమా తో తెలుగు తెరపై సందడి చేసింది. సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఈ చిత్రంలో తేజ్ చెల్లి పాత్రలో కనిపించింది. అయితే సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలని ప్రియా ఎప్పుడూ కూడా అనుకోలేదట. అనుకోకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది.

చిన్నప్పటి నుంచి సినిమా లు చూడడమంటే తనకు ఎంతో ఇష్టమని.. సినిమాలు చూసి ఇంట్లో అద్దం ముందు నిలబడి నచ్చిన హీరోయిన్స్ పాత్రల మాదిరిగా నటించేదానని ఆమె చెప్పుకొచ్చింది. కానీ తాను నటి అవుతానని తన తల్లిదండ్రులే కాదు.. తానూ కూడా అస్సలు ఊహించలేదని తెలిపింది. చదువుకుంటున్న సమయంలోనే నేను అడిషన్ లో పాల్గొని సెలక్ట్ అయ్యానని ఆ సినిమా పూర్తి చేయడానికి తన తల్లిదండ్రులు అంగీకరించినట్లు చెప్పుకొచ్చింది. ఓరు అదార్ లవ్ తో హీరోయిన్ గా పరిచయమై.. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో నటిగా మారినట్లు ప్రియా తెలిపింది.ఈ భామ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు ల్లో నటించి అలరించింది ఇప్పుడు ఈ బ్యూటీ హిందీలో కూడా అవకాశాలు అందుకుంటుంది.. ఓవైపు సినిమా ల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది ప్రియా. నిత్యం తన హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియా లో కూడా భారీ క్రేజ్ సంపాదించుకుంది.

Exit mobile version