కన్నుగీటి కుర్రకారును ఊపేసింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఫేమస్ అయినంత ఈజీగా కెరీర్ ను నిలబెట్టుకోలేకపోయింది. మలయాళ, తెలుగు సినిమాల్లో నటించినా పెద్దగా ఫేమ్ రాలేదు. తెలుగులో చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఎంత ఫాస్ట్ గా ఫేమస్ అయిందో.. అంతే ఫాస్ట్ గా సైడ్ అయిపోయింది. సౌత్ లో ఆమెకు పెద్దగా సినిమా ఆఫర్లే రావట్లేదు. అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గానే ఉంటుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఈమెకు మిలియన్లలో ఫాలోవర్లు ఉన్నారు. అదే ఆమెకు ప్లస్ పాయింట్.
Read Also: The Paradise: నాని సినిమాలో పీపుల్ స్టార్.. నిజమేనా..?
తాజాగా ఆమె సినిమా అవకాశాల గురించి ఓపెన్ అయింది. “నాకు సినిమా ఛాన్సులు చాలా రోజులుగా రావట్లేదు. నాకు ఎవరూ ఛాన్సులు ఇవ్వట్లేదు. కానీ సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తూ సంపాదిస్తున్నాను. అలా వచ్చిన డబ్బులతోనే సర్వైవ్ అవుతున్నాను. నాకు ఛాన్సులు రాకపోయినా నేను బాధపడట్లేదు. నాకు టైమ్ వచ్చినప్పుడు మళ్లీ అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
Read Also: Minister Narayana: 13 మందికి భూకేటాయింపులు రద్దు చేస్తున్నాం..
ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. దానికి మించి ఆమె చేతిలో పెద్దగా అవకాశాలు లేవు. తెలుగులో ఆమె చేసినవి చిన్న సినిమాలే. అందులో హిట్ పర్సెంటేజీ ఎక్కువగా ఉంటే ఈ పాటికి టాలీవుడ్ లో మంచి పొజీషన్ లో ఉండేదేమో. అకవాశాలు వచ్చినా అదృష్టం కలిసి రాలేదు ఈ హీరోయిన్ కు.