Site icon NTV Telugu

Priya Bhavani: అతనికి చాలా మందితో అఫైర్లు ఉన్నాయి.. బ్రేకప్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Priya Bhavani Shankar

Priya Bhavani Shankar

సాధారణంగా హీరోయిన్లు తమ లవ్ లైఫ్ గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడరు. కానీ, ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉన్న కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ మాత్రం తన రిలేషన్‌షిప్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ప్రియ.. గత పదేళ్లుగా రాజ్‌వేల్ అనే వ్యక్తితో ప్రేమిలో ఉన్నారు. ఇటీవల వీరిద్దరూ విడిపోయారంటూ వస్తున్న వార్తలకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.

Also Read : Arijit Singh : ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన అర్జిత్..!

ఒక ఇంటర్వ్యూలో ప్రియ మాట్లాడుతూ.. “రాజ్ నా కాలేజీ మేట్. తనే నా మొదటి.. చివరి బాయ్‌ఫ్రెండ్. అయితే, నేను అతనితో ప్రేమలో పడకముందు, కాలేజీ రోజుల్లో అతనికి చాలా మంది అమ్మాయిలతో అఫైర్లు ఉండేవి, చాలా మందితో డేటింగ్ చేశాడు” అని ఓపెన్‌గా చెప్పేశారు. తనపై వచ్చే లేనిపోని పుకార్లకు చెక్ పెట్టడానికే తన బంధాన్ని బయటపెట్టానని ఆమె స్పష్టం చేశారు. అలాగే నేటి తరం యువతకు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. “ఏదైనా బంధం మీకు నచ్చకపోయినా లేదా అది మీకు భారంగా (Toxic) అనిపించినా, వెంటనే బ్రేకప్ చెప్పి బయటకు వచ్చేయండి” అని ఆమె సూచించారు. గతంలో “నా శరీరం వస్తువు కాదు.. గ్లామర్ షో చేయను” అని చెప్పి సంచలనం సృష్టించిన ప్రియ, ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ విషయాలతో మరోసారి వార్తల్లో నిలిచారు.

Exit mobile version