NTV Telugu Site icon

Accident: నిర్మల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురు సీరియస్..!

Nirmal

Nirmal

నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు ఇవాళ (గురువారం) తెల్లవారు జామున బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సల కోసం హైదరాబాద్ తరలిస్తుండగా అదిలాబాద్‌కు చెందిన ఫర్హాన అనే యువతి మరణించింది. మరొ ముగ్గురి పరిస్థితి సైతం సీరియస్ గానే ఉందని డాక్టర్లు సూచించారు.

Read Also: Viswambhara : ‘విశ్వంభర’లో మెగాస్టార్ పాత్ర ఎలా ఉంటుందంటే..?

కాగా, ప్రయాణికులు మాట్లాడుతూ.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో మహబూబ్ ఘాట్ దగ్గరకు రాగానే డ్రైవర్ ఓవర్ స్పీడ్ గా నడపడంతో బస్సు కంట్రోల్ తప్పి బోల్తా పడిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరి కొందరికి కాళ్లు విరిగితే, కొందరికి చేతులు, నడుము విరిగాయన్నారు. గాయపడ్డ ప్రయాణికులకు నిర్మల్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

Read Also: Bus Accident: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారులు దుర్మరణం

ఇక, హస్పటల్ లో ఒక డ్యూటీ డాక్టర్ తప్ప మరో వైద్యుడు లేరని, సూపరిండెంట్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ప్రయాణికులు వాపోయారు. జిల్లా మెడికల్ హస్పటల్ నిర్మల్ లో ఉండి ఏం లాభం.. ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలు కావడంతో అత్యవసర వైద్య సేవల కోసం కనీసం చికిత్స అందించేందుకు డాక్టర్లు లేకపోవడం దారుణమని సదరు బస్సు ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇక, ఈ ఘటనపై రూరల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోర్లా పడిందని అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయని తెలిసిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.