West Bengal: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ దేశ రాజధాని ఢిల్లీలో ప్రయాణిస్తున్న టైంలో ఆయన కాన్యాయ్ లోకి గుర్తు తెలియని కారు ఒకటి దూసుకొచ్చింది. దీంతో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో ఏమో అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు గవర్నర్ కాన్వాయ్ లోకి వచ్చిన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఢిల్లీ పోలీసులు సదరు కారు డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Read Also: Elon Musk : టెస్లా కార్ల కంటే ముందే మస్క్ ఇండియాలోకి ఎంట్రీ.. ఆ వెంచర్ పార్టనర్ కోసం ప్రయత్నాలు
అయితే, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ను హై సెక్యూర్టీ ప్రాంతానికి తీసుకువెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన మంగళవారం నాడు సాయంత్రం చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఇక, అంతకు ముందు రోజు బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతానికి గవర్నర్ ఆనంద్ బోస్ సందర్శనకు వెళ్లారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ నేత సాజహన్ షేక్ అకృత్యాలు ఎక్కువయ్యాయని స్థానిక మహిళలు ఆరోపించారు. వాటిని తొందరలోనే పరిష్కరిస్తానని పశ్చిమ బెంగాల్ గవర్నర్ బోస్ తెలిపారు.