NTV Telugu Site icon

The Goat Life: 16 ఏళ్ల క్రితం మొదలు.. ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైన పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’!

Prithviraj Sukumaran

Prithviraj Sukumaran

Prithviraj Sukumaran’s The Goat Life Movie to Release on March 28: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా, అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఈ సినిమాను బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్ సహా అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 16 ఏళ్ల క్రితం బీజం పడిన ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ఎట్టకేలకు ప్రకటించారు.

మార్చి 28న ది గోట్ లైఫ్ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ‘ ది గోట్ లైఫ్’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇంట్రెస్టింట్‌గా ఉంది. ‘కాన్సెప్ట్ అనుకుని 16 ఏళ్లవుతోంది, స్క్రిప్ట్ రాసి 10 ఏళ్లవుతోంది. షూటింగ్ స్టార్ట్ అయి 6 ఏళ్లవుతోంది. ఈ వెయిటింగ్ ముగింపునకు వచ్చింది. మార్చి 28న ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) మీ ముందుకు వస్తోంది’ అంటూ మేకర్స్ పేర్కొన్నారు. అంటే ఈ సినిమాకు 16 ఏళ్ల క్రితం బీజం పడిందన్న మాట.

Also Read: KL Rahul: నాలుగో టెస్టుకూ కేఎల్‌ రాహుల్‌ దూరం.. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి!

90వ దశకంలో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన ‘నజీబ్’ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు. ఇది పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందిన తొలి భారతీయ సినిమా కావడం విశేషం. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ది గోట్ లైఫ్ సినిమా ఇన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్.. బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ రిలీజ్ చేసిన సెకండ్ పోస్టర్.. మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసిన ది బిగినింగ్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవలే సలార్: పార్ట్ 1లో నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ స్నేహితుడిగా వరదరాజ మన్నార్‌ పాత్రలో పృథ్వీరాజ్ యాక్టింగ్ ఇరగదీశారు.