Salaar 2 Update: ‘సలార్‌2’ గురించి బిగ్ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌!

Prithviraj Sukumaran Salaar 2

Prithviraj Sukumaran Salaar 2

Prithviraj Sukumaran on Salaar 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’. 2023 డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో దేవాగా ప్రభాస్‌, వ‌ర‌ద రాజమ‌న్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ ఆకట్టుకున్నారు. పార్ట్‌-1ని ట్విస్ట్‌తో డైరెక్టర్ ముగించాడు. దాంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా పార్ట్‌-2పై పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ బిగ్ అప్‌డేట్‌ ఇచ్చారు.

మరికొద్ది రోజుల్లో రెండో పార్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మాట్లాడుతూ… ‘డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా ఖచ్చితంగా 2025లో విడుదల అవుతుందని నేను అనుకుంటున్నా. అయితే కచ్చితమైన రిలీజ్ డేట్ మాత్రం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సలార్‌ 2లో కొన్ని సీక్వెన్స్‌లను పూర్తి చేయడానికి నేను ‘ఎల్‌2: ఎంపురాన్‌’ నుంచి కొన్ని రోజులు బ్రేక్‌ తీసుకోవాలి’ అని తెలిపారు.

Also Read: Taapsee Pannu Marriage: అందుకే పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా: తాప్సీ

నటుడు బాబీసింహా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సలార్‌ 2 కథ సిద్ధంగా ఉందని, ఏప్రిల్‌లో చిత్రీకరణను ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు అయితే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయలేదు. పార్ట్‌ 2ను ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో తెరకెక్కించనున్నారు. శత్రువులుగా మారే ఇద్దరు ప్రాణ స్నేహితుల కథతో పార్ట్‌ 2 రానుంది. ప్రస్తుతం ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తుండగా.. ‘ బడే మియాన్ చోటే మియాన్‌’లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు.