Site icon NTV Telugu

Prithvi Shaw: బ్యాట్‌ ఎత్తడం, కాలర్ పట్టుకోవడం, దుర్భాషలాడటం.. పృథ్వీ షా ఇక మారాడా?

Prithvi Shaw And Musheer Khan Fight

Prithvi Shaw And Musheer Khan Fight

ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాడు పృథ్వీ షా పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినబడుతోంది. నెట్టింట వార్తల్లో నిలిచేది ఆటతో మాత్రం కాదు. తన ఫిట్‌నెస్‌, డేటింగ్, వివాదాస్పద ప్రవర్తన కారణంగా పృథ్వీ హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నాడు. బీసీసీఐ సహా ముంబై జట్టు అతడిపై చర్యలు తీసుకున్నా.. మారడం లేదు. దురుసు ప్రవర్తనను అలానే కొనసాగిస్తున్నాడు. తాజాగా మాజీ సహచరుడి పైనే బ్యాట్‌ ఎత్తాడు. అక్కడితో ఆగకుండా కాలర్ పట్టుకోవడం, దుర్భాషలాడటం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ముంబై, మహారాష్ట్రల మధ్య మూడు రోజుల మ్యాచ్‌ జరుగుతోంది. మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పృథ్వీ షా భారీ సెంచరీ (181) చేశాడు. పృథ్వీ బ్యాటింగ్ చూస్తే.. డబుల్ సెంచరీ పక్కా అని అందరూ అనుకున్నారు. ముంబై ఆల్‌రౌండర్‌ ముషీర్ ఖాన్ వేసిన బంతిని భారీ షాట్‌కు యత్నించిన పృథ్వీ.. లాంగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. పృథ్వీ డబుల్ సెంచరీ మిస్ అవ్వడంతో.. ముషీర్ సంతోషంలో ‘థాంక్యూ’ అని అన్నాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన పృథ్వీ.. తన బ్యాట్‌ను ముషీర్‌ వేగంగా వైపు తిప్పాడు. ముషీర్‌ తృటిలో ఆ ప్రమాదంను తప్పించుకున్నాడు.

Also Read: Pat Cummins-IPL: కమిన్స్‌కు రూ.58 కోట్లు ఆఫర్ చేసిన ఐపీఎల్ ప్రాంచైజీ.. కానీ ఓ కండిషన్!

పృథ్వీ షా అక్కడితో ఆగలేదు. మరింత వేగంగా ముషీర్ ఖాన్ వైపు వెళ్లి అతడి కాలర్ పట్టుకున్నాడు. ఆ తర్వాత దుర్భాషలాడాడు. అంపైర్లు, ముంబై ప్లేయర్స్ కలగజేసుకోవడంతో పృథ్వీ వెనక్కి తగ్గాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పృథ్వీ షా దురుసు ప్రవర్తనపై అందరూ మండిపడుతున్నారు. ‘పృథ్వీ షా ఇక మారాడా?’, ‘ఇలా అయితే భారత జట్టులోకి పృథ్వీ షా రావడం కష్టమే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పృథ్వీ కెరీర్‌లో ఇలాంటివి వివాదాలు ఎన్నో ఉన్నాయి. మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం, డోపింగ్‌ టెస్టులో విఫలం, డీసీ కోచ్ రికీ పాంటింగ్‌పై విమర్శలు.. ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి.

Exit mobile version