NTV Telugu Site icon

Prithvi Shaw: పృథ్వీ షాపై వేటు.. ఇక కెరీర్‌ క్లోజ్ అయినట్టే?

Prithvi Shaw

Prithvi Shaw

టీమిండియా క్రికెటర్‌ పృథ్వీ షాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే భారత జట్టుకు దూరమైన అతడు.. తాజాగా రంజీ ట్రోఫీ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. ముంబై రంజీ టీమ్‌లోకి పృథ్వీ షాను ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో అఖిల్ హెర్వాడ్కర్‌ రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. పృథ్వీ షా పక్కనపెట్టడానికి ముంబై క్రికెట్ అసోసియేషన్ స్పష్టమైన కారణం చెప్పలేదు కానీ.. ఫామ్, ఫిట్‌నెస్‌, క్రమశిక్షణారాహిత్యం కారణంగానే వేటు వేసినట్లు తెలుస్తోంది.

పృథ్వీ షా ఫామ్ ప్రస్తుతం ఏమాత్రం బాగాలేదు. క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోతున్నాడు. అతడి ఫిట్‌నెస్‌ అంతంత మాత్రంగానే ఉంది. షా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నాడు. ఇక నెట్‌ సెషన్స్‌కు ఆలస్యంగా రావడంతో పాటు కొన్నిసార్లు డుమ్మా కొడుతున్నాడట. నెట్‌ సెషన్స్‌ను అస్సలు సీరియస్‌గా తీసుకోవట్లేదని సమాచారం. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలక్టర్లు అతడిపై వేటు వేశారట. పృథ్వీ షాని జట్టు నుంచి తప్పించడాన్ని కెప్టెన్, కోచ్‌ కూడా సమర్థించినట్లు తెలుస్తోంది.

Also Read: Gold Rate Today: పెరుగుదలకు నో బ్రేక్.. 80 వేలకు చేరువైన బంగారం!

పృథ్వీ షా 18 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ చేసి ఔరా అనిపించాడు. దూకుడైన ఆటతో జూనియర్ సెహ్వాగ్ అని కూడా పిలుపించుకున్నాడు. కొన్ని మ్యాచ్‌లలో మెరిసిన పృథ్వీ.. ఆపై పేలవ ఫామ్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. భారత్ తరఫున చివరగా 2021 జులైలో టీ20 మ్యాచ్‌ ఆడాడు. బీసీసీఐ సెలెక్టర్లు అతడిని ఎప్పుడో మర్చిపోయారు. జభారత ట్టుకు దూరమైనా.. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఆటపై ఫోకస్ పెట్టలేకయాడు. ఇప్పుడు రంజీ ట్రోఫీ జట్టులోనూ చోటు కోల్పోయాడు. ఇప్పటికైనా శైలి మార్చుకోకుంటే.. కెరీర్‌ క్లోజ్ అయినట్టే?.

Show comments