Site icon NTV Telugu

Prithvi Shaw: టాలీవుడ్ హీరోయిన్‌తో పృథ్వీ షా డేటింగ్.. ఫొటోస్ వైరల్!

Sam

Prithvi Shaw Dating

Prithvi Shaw Dating with Akriti Agarwal: టీమిండియా క్రికెట‌ర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతడు వార్తల్లో నిలిచింది తన ఆటతో మాత్రం కాదు. రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్, టాలీవుడ్ హీరోయిన్‌ అకృతి అగర్వాల్‌తో కలిసి 2025 గణేశ్ చతుర్థిని పృథ్వీ షా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ అకృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇద్దరూ గణేశుడి విగ్రహం పక్కన నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెయిర్ బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఈ అకృతి అగర్వాల్‌ ఎవరు అని నెటిజెన్స్ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. అకృతి అగర్వాల్ 2 మే 2003న లక్నోలో జన్మించారు. ఆమె డిజిటల్ కంటెంట్ సృష్టికర్త, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. ముంబైలోని నిర్మలా మెమోరియల్ ఫౌండేషన్ కళాశాలలో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. డిగ్రీ చదువుతున్నప్పుడు అకృతి సోషల్ మీడియా మొగ్గు చూపారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో టిక్‌టాక్‌లో డ్యాన్స్ వీడియోలు చేసి పాపులర్ అయ్యారు. భారతదేశంలో టిక్‌టాక్ నిషేధించబడిన తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌పై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆమెకు 3.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ ఛానెల్‌కు 88.8 వేలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘త్రిముఖ’ అనే టాలీవుడ్ మూవీలో ఆకృతి హీరోయిన్‌గా నటించారు. ఇక బాలీవుడ్ ఆరంగేట్రంకు సిద్ధమవుతున్నారు.

Also Read: Lakshmi Menon: యువకుడి కిడ్నాప్ కేసు.. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట!

మరోవైపు ఫామ్ కోల్పోయిన ప్రథ్వీ షా భారత జట్టులో చోటు కోల్పోయాడు. ముంబై క్రికెట్ అసోషియేషన్‌కు టాటా చెప్పిన అతడు.. ప్రస్తుతం మహారాష్ట్రకు ఆడుతున్నాడు. బుచ్చిబాబు టోర్నీ 2025లో ఆడుతున్న ప్రథ్వీ షా.. ఛత్తీస్‌ఘడ్‌ (111)పై సెంచరీ చేశాడు. తమిళనాడుపై కూడా హాఫ్ సెంచరీ బాది సత్తాచాటాడు. ఇదే జోరును కొనసాగిస్తే ఐపీఎల్‌ 2026లో ఆడే ఛాన్స్ ఉంటుంది. ప్రథ్వీ షా చివరిసారిగా జూలై 2021లో భారత్ తరపున ఆడాడు. నటి నిధి తపారియాతో బ్రేకప్ తర్వాత అకృతితో అతడు ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కలిసి ముంబైలో చాలాసార్లు జంటగా కనిపించారు.

Exit mobile version