Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్‌కు ఆయన సతీమణి భువనేశ్వరికి జైలు అధికారులు అనుమతి తిరస్కరించారు. ఈ వారంలో రెండుసార్లు చంద్రబాబు కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. మూడోసారి ములాఖత్ కావాలంటే నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం జైలు అధికారులదే కావడం గమనార్హం. మూడు రోజుల పాటు జైలు సూపరిండెంట్ సెలవులో ఉన్నారు. జైలు ఇంఛార్జి సూపరిడెంట్‌గా కోస్తాంధ్ర జైళ్లు శాఖ డీఐజీ రవికిరణ్ ఉన్నారు.
Also Read: AP CM Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం జగన్
ఇదిలా ఉండగా.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కాదనడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.