Site icon NTV Telugu

Tirupati: అర్ధరాత్రి విద్యార్థినుల గదిలో దూరిన ప్రిన్సిపాల్.. ట్విస్ట్‌ ఏంటంటే..?

Tirupati

Tirupati

Tirupati: తిరుపతిలోని ఓ నర్సింగ్‌ కాలేజీలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. లీలామహల్ సర్కిల్ లో ఉన్న వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్‌లోకి ప్రవేశించిన ప్రిన్సిపాల్.. అర్థరాత్రి విద్యార్థినుల గదిలోకి దూరాడట.. అయితే, అప్రమత్తమైన విద్యార్థినులు తమ గదిలోకి దూరిన ప్రిన్సిపాల్ వర్మను నిర్భందించారు.. ఆ తర్వాత అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు నర్సింగ్ విద్యార్థినులు.. దీంతో, రంగంలోకి దిగిన అలిపిరి పోలీసులు.. ప్రిన్సిపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు.. ఇక, అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థినులు ఆందోళనకు దిగారు.. వర్మను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు..

Read Also: Supreme Court: బెంగాల్ టీచర్లకు ఉపశమనం.. కీలక ఆదేశాలు జారీ

మరోవైపు.. పక్క భవనంలో దూకిన విద్యార్థిని నిలదీసిన ప్రిన్సిపాల్ వర్మ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంటూ కొందరు విద్యార్థినులు.. ప్రిన్సిపాల్‌కు బాసటగా నిలిచారు.. కేవలం రాత్రి సమయంలో వేరే చోటకు వెళ్తున్న వారిని నిలువరించేందుకు ప్రినిపాల్ వర్మను పిలిచినట్టు వారు చెబుతున్నారు.. దీంతో, ఈ వ్యవహారంలో బిగ్‌ ట్విస్ట్‌ వచ్చి చేరినట్టు కాగా.. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విచారణ చేపట్టారు అలిపిరి పోలీసులు.. అయితే, విచారణ అనంతరం ప్రిన్సిపాల్ వర్మపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు అలిపిరి పోలీసులు.. మరోవైపు.. న్యాయం చేయాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు..

Exit mobile version