NTV Telugu Site icon

PM Modi: నేడు గోవాలో ప్రధాని పర్యటన.. ‘ఇండియా ఎనర్జీ వీక్’ను ప్రారంభించనున్న మోడీ

Pm Modi

Pm Modi

నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గోవాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘ఇండియా ఎనర్జీ వీక్ 2024’ను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా.. 1,350 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) క్యాంపస్‌ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం డెవలప్‌డ్ ఇండియా, డెవలప్‌డ్ గోవా 2047 కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

Read Also: AP Assembly: గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం.. అసెంబ్లీ ముందుకు రెండు కీలక బిల్లులు

ఇక, ఇవాళ దక్షిణ గోవాలోని బేతుల్ గ్రామంలో ఉదయం 10.30 గంటలకు ONGC సీ సర్వైవల్ సెంటర్‌ను ప్రధాని మోడీ ప్రారంభించి.. ఆ తర్వాత ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభంచనున్నారు. ఎనర్జీ వీక్ అనేది భారతదేశం యొక్క అతి పెద్ద ఓమ్నిచానెల్ ఎనర్జీ ఎగ్జిబిషన్.. దీని ప్రారంభోత్సవానికి వివిధ దేశాల నుంచి దాదాపు 17 మంది ఇంధన మంత్రులు హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ కార్యక్రమంలో 900 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. ఇది కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, రష్యా, బ్రిటన్, అమెరికా లాంటి ఆరు దేశాల నుంచి పెవిలియన్లను కలిగి ఉంటుంది.

Read Also: U19 World Cup 2024: నేడు దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్‌.. సూపర్‌ ఫామ్‌లో యువ భారత్‌!

అయితే, ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఇవాళ్టి నుంచి 9వ తేదీ వరకు గోవాలో నిర్వహించబడుతోంది. స్టార్టప్‌లను ప్రోత్సహించడంతో పాటు ఎనర్జీ వాల్యూ చైన్‌లో ఏకీకృతం చేయడమే ఇండియా ఎనర్జీ వీక్ 2024లో ఒక ముఖ్య ఉద్దేశం. ఇంధన రంగంలో భారతీయ MSMEలు ముందున్న వినూత్న పరిష్కారాలను ప్రదర్శించడానికి ప్రత్యేక మేక్ ఇన్ ఇండియా పెవిలియన్ కూడా నిర్వహించబడుతోంది.