PM Modi: రేపు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్ షోలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు సాగనున్న మోడీ రోడ్ షో కొనసాగనుంది. రేపు ఉదయం మహబూబాబాద్ బహిరంగ సభ, మధ్యాహ్నం కరీంనగర్ బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు రాత్రి ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.
Also Read: PM Modi Tirumala Tour: తిరుమల పర్యటనకు ప్రధాని మోడీ.. శ్రీరచన అతిథి గృహంలో బస
రేపు సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి వయా నారాయణగూడ, వైఎంసీఏ, కాచిగూడ చౌరస్తా వీరసావర్కర్ విగ్రహం వరకు రోడ్ షోలో ప్రధాని మోడీ పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, తదితర నేతలు పాల్గొననున్నారు.